ఆర్ధిక రాజధానిగా విశాఖపట్నం! జగన్ ఆలోచనలో రెండో రాజధాని

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకొని తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.మరో వైపు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రివర్గాన్ని కూడా ఖరారు చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరిపాలనని మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్న జగన్ దానికి తగ్గట్లుగానే పావులు కదుపుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 Ap Cm Jagan Thinking About Visakha For Second Capital To Andhra Pradesh-TeluguStop.com

ఇప్పటికే తన క్యాబినెట్ ని కూడా ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేసుకున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ద్రుష్టిలో రాజధాని ఇష్యూ ఒకటి ఉందని తెలుస్తుంది.

ఇప్పటికే అమరావతిని రాజధానిగా గత టీడీపీ ప్రభుత్వం ఖరారు చేసిందని.అయితే ఇప్పట్లో అమరావతిని ఉన్నపళంగా అభివృద్ధి చేసే అవకాశం అంతంత మాత్రంగానే ఉంది.

ఈ నేపధ్యంలో అమరావతిని మెల్లగా అభివృద్ధి చేస్తూ మరో వైపు ఏపీకి రెండో రాజధానిగా విశాఖని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఏపీకి ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చే నగరంగా ఉన్న విశాఖపట్నం అభివృద్ధిలో దూసుకుపోతుంది.

ఈ నేపధ్యంలో అక్కడ నుంచి కూడా ప్రభుత్వ పరిపాలన ఉండే విధంగా జగన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది.ఇలా చేయడం అన్ని జిల్లాల వారికి రాజధానులు అందుబాటలో ఉండటంతో పరిపాలన సులభం అవుతుందని అనుకుంటున్నట్లు సమాచారం.

ఆరు నెలలు విశాఖ నుంచి ఆరు నెలలు అమరావతి నుంచి ప్రభుత్వ పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ముఖ్యమంత్రి జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం.అదే జరిగితే ఇంత కాలం వెనుకబడిన ప్రాంతంగా ఉండిపోయిన ఉత్తరాంద్రకి న్యాయం చేసినట్లు అవుతుంది అని విశాఖ ప్రజల నుంచి వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube