టీడీపీలో ఉక్కబోత..? ఫ్యాను గాలి కావాలంటున్న నేతలు ?

ఒకవైపు కరోనా వైరస్ ప్రభావంతో జనమంతా అతలాకుతలమవుతుంటే, ఏపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో మాత్రం నాయకులు అసంతృప్తి వ్యవహారాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.తెలుగుదేశం పార్టీపై అసంతృప్తిగా ఉన్న నాయకులు, పార్టీ భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నవారు, ఏపీ అధికార పార్టీ వైసీపీలో సముచిత స్థానం దక్కుతుందన్న భరోసా పొందిన నాయకులు ఇలా అంతా వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Tdp Seniour Leaders Ready To Join In Ycp Party In Soon, Ap Cm Jagan, Tdp Chandra-TeluguStop.com

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో టిడిపి నాయకులు పెద్ద ఎత్తున చేరిపోగా, మరికొంతమంది కీలక నాయకులు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అప్పుడు పార్టీ మారాలని నిర్ణయించుకుని కాస్త వెనుకడుగు వేశారు.మరి కొంత మంది నేతలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో వెయిటింగ్ లో ఉన్నారు.

Telugu Ap Cm Jagan, Shathakamani, Tdp Chandrababu, Yamini Bala-Political

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంతమంది పార్టీ మారగా, మరికొందరు చేరుదాము అనుకునే లోపులో అకస్మాత్తుగా స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడంతో బ్రేకులు పడ్డాయి.ఇంతలోనే కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో చుట్టుముట్టడంతో మొత్తం అన్ని పార్టీల రాజకీయ వ్యవహారాలను పక్కన పెట్టడంతో ఈ జంపింగులు వ్యవహారం కాస్త సద్దుమణిగింది.అయితే తెలుగుదేశం పార్టీ లో ఉన్న అసంతృప్తి నేతలు మాత్రం ఆ పార్టీలో ఇమడ లేకపోతున్నారు.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఎప్పటికీ వైసీపీలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేరిపోయారు.

అందులో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.అలాగే అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శతకమని ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల తో పాటు పార్టీ మారడం, అలాగే గత ఎన్నికల్లో చీరాల నుంచి విజయం సాధించిన కరణం బలరాం సీనియర్ నాయకుడు వైసీపీ కండువా కప్పుకోవడం తో తెలుగుదేశం పార్టీలో మరింత ఆందోళన పెరుగుతోంది.

Telugu Ap Cm Jagan, Shathakamani, Tdp Chandrababu, Yamini Bala-Political

ఈ వ్యవహారం ఇలా ఉంటే పార్టీకి మొదటి నుంచి అండగా ఉంటూ వస్తున్న సీనియర్ నాయకులు చాలామంది వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మొదటి నుంచి ఉంటూ వస్తున్న అనంతపురం జిల్లా రాయదుర్గం కి చెందిన కాల్వ శ్రీనివాసులు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.అలాగే విజయనగరం జిల్లాకు చెందిన శోభా హైమావతి, ఆమె కుమార్తె మాజీ జెడ్పీ చైర్మన్ స్వాతి రాణి ఇప్పటికే వైసీపీ లోకి వెళ్ళిపోయారు.అలాగే కృష్ణా జిల్లా పామర్రు మాజీ ఎమ్మెల్యే ఎస్సీ నాయకురాలైన ఉప్పులేటి కల్పన వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

వీరే కాకుండా గోదావరి జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది వైసీపీ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే సమాచారం టిడిపిలో కలవరం పుట్టిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube