ఏపీలో కరోనా కట్టడికి జగన్ కొత్త నిర్ణయం! వాళ్ళు రెండు వారాలు ఇంట్లోనే

కరోనా ప్రభావం ఇండియాలో కూడా మెల్లగా పెరుగుతుంది.కరోనా పోజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి ఎక్కువ అవుతుంది.

 Ap Cm Jagan Take Decision On Foreign Returns For Corona Control-TeluguStop.com

అయితే ఇప్పటి వరకు రెండు మరణాలే సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.అయితే పూర్తి స్థాయిలో చూస్తే కరోనా పోజిటివ్ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

ఇదిలాఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా నియంత్రణకి ముఖ్యమంత్రులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాసంస్థలు బంద్, సినిమా థియేటర్స్ బంద్ చేయించారు.

ఉద్యోగులని ఇప్పట్లో విదేశాలకిపంపించోద్దని ఐటీ కంపెనీలకి ఆదేశాలు జారీ చేశారు.అలాగే కరోనా పోజిటివ్ కేసులు గుర్తించేందుకు మరింత కార్యాచరణ సిద్ధం చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ఏపీలో కరోనా కారణంగా ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలని వాయిదా వేసింది.ఈ ఎన్నికలు వాయిదా పడటం జగన్ కి ఎంత మాత్రం ఇష్టంలేదు.

ఈ కారణంగా కరోనా మీద కోపంతో ఉన్న జగన్ ఇప్పుడు దానిని కంట్రోల్ చేసే విషయంలో కాస్తా కఠిన వైఖరి అవలంబిస్తున్నాడు.ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేవారు రెండు వారాల పాటు ఇల్లు వదిలి బయటకి రాకూడదని, అలా వస్తే చట్టపరంగా కఠిన శిక్ష తీసుకోవడం జరుగుతుందని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

ఇతర దేశాల నుంచి వచ్చిన వారి వలెనే కరోనా వ్యాపిస్తుందని నిర్ధారణ కావడంతో జగన్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు.దీనిపై కలెక్టర్లకి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube