పంచె కట్టి .. నామం పెట్టి ! బీజేపీని బుట్టలో వేసేసిన జగన్

జగన్ నిర్ణయాలు, ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో తలపండిన రాజకీయ మేధావులకు సైతం అర్థం కాదు.ఒక్కోసారి జగన్ తీసుకున్న నిర్ణయాలు సొంత పార్టీ నేతలకు షాక్ ఇస్తూ ఉంటాయి.

 Ap Cm Jagan Sensational On Ttd Declaration Issue  Jagan, Tirumala, Ap Cm, Bjp Le-TeluguStop.com

అసలు జగన్ ఎంత తెలివి తక్కువ నిర్ణయం ఎలా తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతూ ఉంటాయి.కానీ చివరికి ఫలితాలు చూసి అంతా జగన్ నిర్ణయమే కరెక్ట్ అనుకునే పరిస్థితి వస్తుంది.

2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర సమయంలో ఇదే విధంగా కాపులను బీసీల్లో చేరుస్తానని తాను బాబు మాదిరిగా మోసం చేయలేను అని, తాను రిజర్వేషన్ ఇవ్వలేనని, కేంద్రం ఇస్తే అడ్డు చెప్పను అంటూ జగన్ చేసిన ప్రకటన అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది.వైసీపీ నాయకులు సైతం జగన్ తొందరపాటు నిర్ణయం అని, చేదు ఫలితాలు వస్తాయని భయపడ్డారు.

కానీ జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని, ఫలితాలు వచ్చిన తర్వాత కానీ ఎవరికీ అర్థం కాలేదు.అది అలా ఉంటే హిందుత్వం విషయంలో జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

జగన్ హిందూ వ్యతిరేకి అనే ముద్రలను సైతం వేయించుకున్నారు.దీనికి తగ్గట్టుగా వరుసగా హిందూ ఆలయాలపై దాడులు జరగడంతో  వైసిపి ప్రభుత్వం ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ అంశం లో బీజేపీ ఆగ్రహానికి గురైంది.తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా,  సీఎం హోదాలో జగన్ పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో జగన్ డిక్లరేషన్ పై సంతకం చేస్తారా లేదా అనే విషయం పై పెద్ద దుమారమే రేగింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లరేషన్ పై సంతకం చేసేది లేదని వైసిపి పంతానికి వెళ్లడం, బీజేపీ టీడీపీలు దీనిపై పెద్ద రాద్ధాంతం చేయడంతో, జగన్ ఈ విషయంలో బీజేపీ ఆగ్రహానికి గురయ్యారు.

Telugu Ap Cm, Temples, Bjp Tdp, Bjp, Jagan, Tirumala-Telugu Political News

దీంతో ఈ వివాదాన్ని జగన్ ఎలా పరిష్కరించుకుంటారు అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొనగా, జగన్ ఎవరి ఊహల కు అందకుండా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే ముందు పంచె కట్టుతో, నుదుట తిరునామం తో కనిపించడంతో అందరి నోళ్ళు మూతపడ్డాయి.ఈ వ్యవహారం పై జగన్ ను ఇరికించి విమర్శలు చేయవచ్చని ప్రయత్నించిన బీజేపీ, టీడీపీలు జగన్ చర్యలతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి.తాను హిందూ వ్యతిరేకి కాదని, తనకు హిందూ మతం అంటే ఎంతో గౌరవం మర్యాదలు ఉన్నాయని జగన్ ఈ చర్య ద్వారా నిరూపించుకున్నారు.

అలాగే కేంద్ర బీజేపీ పెద్దలకు తన విషయంలో క్లారిటీ ఇచ్చేశారు.ఇప్పుడు హిందుత్వం విషయంలో కాని, జగన్ క్రిస్టియానిటీ అనే విషయాన్ని హైలెట్ చేసి విమర్శలు చేసే విషయంలో గాని, ప్రతిపక్షాలకు ఆస్కారం లేకుండా జగన్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు.

అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలనే వాదనకు ఇలా పంచె కట్టు, నుదుట నామాలతో జగన్ చెక్ పెట్టేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube