ఒక్క క్లిక్‌తో 3.70 లక్షల మంది ఖాతాల్లో డబ్బు వేసిన సీఎం జగన్‌

సుదీర్ఘ కాలంగా అగ్రీగోల్డ్‌ బాధితులు పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే.అగ్రీ గోల్డ్‌ ఆస్తులను అమ్మి బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేశాయి, ఇంకా చేస్తూనే ఉన్నాయి.అగ్రీ గోల్డ్‌లో పది వేలకు తక్కువ డిపాజిట్‌ చేసిన వారికి వారి మొత్తంను ప్రభుత్వం స్వయంగా ఇవ్వాలని నిర్ణయించింది.3.70 లక్షల మంది అగ్రీ గోల్డ్‌ కస్టమర్లకు డబ్బు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.పది వేల లోపు ఉన్న వారందరి జాబితాను సిద్దం చేసిన ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా డబ్బును వేయడం జరిగింది.

 Ap Cm Jagan Send The Amount One Click Button-TeluguStop.com

నేడు ఆ కార్యక్రమం గుంటూరు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగింది.భారీ ఎత్తున అగ్రీగోల్డ్‌ బాధితులు ఈ కార్యక్రమంలో హాజరు అయ్యారు.వారందరి సమక్షంలో ల్యాప్‌ టాప్‌లో ఒక్క క్లిక్‌ చేయడంతో 3.70 లక్షల మందికి ఒకేసారి డబ్బు అనేది చేరిపోయింది.వెంటనే డబ్బులు పడటంతో ఆనందంతో అక్కడ ఉన్న వారు అంతా గట్టిగా చప్పట్లు కొట్టారు.ఒకేసారి అందరికి మొబైల్స్‌ మెసేజ్‌ల సౌండ్‌ తో అక్కడ మొత్తం దద్దరిల్లింది.

ఒకేసారి అంత మందికి డబ్బులు వేయడంతో జగన్‌ పట్ల అంతా కూడా అభిమానం వ్యక్తం చేశారు.పెద్ద మొత్తం ఉన్న వారికి కూడా త్వరలోనే సెటిల్‌ చేస్తానంటూ జగన్‌ హామీ ఇచ్చారు.

అగ్రీ గోల్డ్‌ ఆస్తులను అమ్మి పెద్ద మొత్తం ఉన్న వారికి చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు.మొబైల్‌కు మెసేజ్‌లు రావడంతో వాటిని చూపిస్తూ ఆనందంగా అగ్రీగోల్డ్‌ వినియోగదారులు అక్కడ నుండి వెళ్లి పోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube