తిరుపతి రుయా ఆస్పత్రి ప్రమాద ఘటన పై స్పందించిన సీఎం జగన్.. !

దేశంలో కరోనా కారణంగా వినిపిస్తున్న ఆర్తనాధాలకు ఒక్క నేత హృదయం కూడా కరగడం లేదు.అందులో కరోనా పేషెంట్ల పై అధికారుల నిర్లక్ష్యం అడుగడుగున కనిపిస్తుంది.

 Ap Cm Jagan Responds To Tirupati Rua Hospital Incident Of 11 Died-TeluguStop.com

కనీసం రోగుల సేవకు అందించే అత్యవసరమైన సదుపాయాలు కూడా కల్పించలేని స్దితిలో మన ప్రభుత్వాలు ఉండటం సిగ్గు చేటు.ఎన్నో ప్రాణాలు పోతున్నా గానీ కళ్లు తెరవని ఈ సమాజంలో రాజకీయాలు కేవలం ఆస్తులు కూడబెట్టుకోవడానికి, పదవులు అనుభవించడానికే పనికి వస్తున్నాయని ఈ కరోనా సమయంలో నేతల ప్రవర్తన నిరూపిస్తుందట.

ఇకపోతే నిన్న తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మరణించిన ఘటన హృదయాలను కలిచి వేస్తుంది.కాగా ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 Ap Cm Jagan Responds To Tirupati Rua Hospital Incident Of 11 Died-తిరుపతి రుయా ఆస్పత్రి ప్రమాద ఘటన పై స్పందించిన సీఎం జగన్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఘటన పై చిత్తూరు జిల్లా కలెక్టర్‌ అందించిన వివరాలను సీఎం జగన్ కు సీఎంఓ అధికారులు వివరించగా, పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.

ఇక ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ఆక్సిజన్‌ సేకరణ, సరఫరాలపైనే కాకుండా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ వ్యవస్థల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు తెలిపారు.

#Lack Of Oxygen #Corona Patients #RuaHospital #Inccident #CM Responds

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు