ఉదయం చిన్న పిల్లల ఆసుపత్రి ఓపెన్.. సాయంత్రం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతిలో రెండు రోజుల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో నగరంలో బాడ్ ఆస్పత్రిలో ఉన్న చిన్నపిల్లల గుండె చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు.

 Ap Cm Jagan Presented Silk Clothes To Tirupathi Temple, Ap Cm Jagan, Tirupathi T-TeluguStop.com

అనంతరం శ్రీవారి పాదాల వద్ద అలిపిరి నడక మార్గం పైకప్పును గోమందిరాన్ని ప్రారంభించారు.ఈరోజు మధ్యాహ్నం విజయవాడ నుండి సీఎం జగన్ బయలుదేరి తిరుపతికి చేరుకోవడం జరిగింది.

ఉదయం ఆసుపత్రి మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్ సాయంత్రం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ క్రమంలో వేదపండితులు ఆశీర్వచనం ఇవ్వటం జరిగింది.

ఇదే సమయంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సీఎం జగన్ కి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం 2022 టీటీడీ క్యాలెండర్ ఆవిష్కరించటం జరిగింది.

ఇదిలా ఉంటే రేపు తిరుమల కొండపై జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో జగన్ పాల్గొననున్నారు. ఇక ఇదే తరుణంలో రేపు విజయవాడ ఆలయానికి.

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన డానికి జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు విచ్చేయనున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube