కరోనా పరీక్షల్లో వైద్యుల పనితీరు భేష్ : సీఎం జగన్

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కరోనా యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తోందనే విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ పరీక్ష నిర్వహణపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.

 Ap, Cm Jagan, Corona, Test , Ap Cm Ys Jagan Praises Doctors-TeluguStop.com

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారిని ఉద్దేశిస్తూ మాట్లాడారు.

సీఎం జగన్ మాట్లాడుతూ.‘‘ ఏపీలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నా దాన్ని నియంత్రణ చర్యలు అలానే తీసుకుంటున్నాం.కరోనా కేసులు పెరుగుతున్నా రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదు.ఈ రోజు ఏకంగా ఆరువేలకు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కేసులు దాచిపెట్టడం వల్ల ప్రయోజనం లేదు.ప్రజలు కలిసి పోరాటం చేయనంత వరకూ వైరస్ ను కట్టడి చేయలేం.

రోజూ చేసే కరోనా యాంటిజెన్ ర్యాపిడ్ పరీక్షల్లో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానం నిలిచింది.

రోజుకు 50 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం మనది.ప్రతి మిలియన్ కు 31 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నారు.90 శాతం పరీక్షలు కోవిడ్-19 క్లస్టర్లలోనే నిర్వహిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.కోవిడ్ ను కట్టడి చేయడంలో అధికారులు, కలెక్టర్లు, వైద్యులు పని తీరు మెచ్చుకోదగింది.ఇంకొద్ది రోజుల వరకే ఈ సమస్యతో పోరాటం చేస్తాం.పూర్తి స్థాయిలో దీనికి వ్యాక్సిన్ అందుబాటులో వస్తే ఎలాంటి సమస్య ఉండదు.రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 1.06గా ఉంది.85 శాతం మంది హోం క్వారంటైన్ లో ఉంటూ వైరస్ బారి నుంచి భయటపడ్డారు.’’ అంటూ సీఎం పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube