బీజేపీ ఆఫర్ కు జగన్ ఒప్పుకున్నట్టేనా ?

ఏపీలో రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్ ఆ తరువాత పరిపాలన మీద పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే అవకాశమే కనిపిస్తోంది.ఇక జగన్, కేసీఆర్ , ప్రధాని నరేంద్ర మోదీల ఉమ్మడి శత్రువైన చంద్రబాబు ను అన్నిరకాలుగా ఇరుకున పెట్టేందుకు చూస్తున్నట్టుగా అర్ధం అవుతోంది.

 Ap Cm Jagan Ok For Bjp Offer-TeluguStop.com

ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు వైసీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చారట.తాజాగా ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షాను జ‌గ‌న్ క‌లిసిన నేప‌థ్యంలో జ‌గ‌న్ ను ఎన్డీఏలోకి రావాల్సిందిగా వారంతా కోరారట.

అయితే ఈ విషయంపై జగన్ ఎవరికీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదట.

అసలు ఎన్నికల ముందు బీజేపీ, వైసీపీ రెండు విడివిడిగానే పోటీ చేసాయి.

కానీ ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పేద్ద‌ల‌తో స‌త్సంబంధాలు నెర‌పుతున్నారు.తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఉమ్మడి శ‌త్రువుగా ఉన్న చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టేందుకు జ‌గ‌న్ కు బీజేపీ కొంత‌మేర స‌హ‌క‌రించింద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

ఈ అంశాన్ని ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని భావించినా పెద్ద‌గా క‌లిసి రాలేదు.అదీకాకుండా కేంద్రంలో ఎన్డీఏకు 350 వ‌ర‌కు సీట్లు ఉండ‌టంతో కేంద్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు త‌న అవ‌స‌రం ఉంటుంద‌నుకున్న జ‌గ‌న్ అంచ‌నాలు త‌ప్పాయి.

అందుకే రాష్ట్ర అవసరాల దృష్ట్యా కేంద్ర అధికార పార్టీతో కలిసి ముందుకు వెళ్లేందుకు జగన్ సిద్ధం అవుతున్నాడట.

-Telugu Political News

ఏపీకి ప్ర‌త్యేక హోదా కాకుండా రాష్ట్రానికి ఇంకేమైనా సాయం చేస్తేనే ఏదైనా ఆలోచిస్తానని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.ప్ర‌స్తుతానికి కేంద్రంలో మ్యాజిక్ ఫిగ‌ర్ కంటే చాలా ముందున్న ఎన్డీఏకు జ‌గ‌న్ అవ‌స‌రం ఇప్పుడు లేకున్నా భ‌విష్య‌త్ లో ఉంటుంది.జ‌గ‌న్ కు ఉన్న 22 మంది ఎంపీల మ‌ద్ద‌తు ఎన్డీఏకు ఇచ్చి ప్ర‌భుత్వంలో చేరితే ఏపీకి కావాల్సిన అన్ని బెనిఫిట్స్ కలుగ చేస్తామని హామీ ఇచ్చారట.

కేంద్రానికి వైసీపీ అవసరం చాలా ఉంది.రాజ్య‌స‌భ‌లోనే జ‌గ‌న్ కు వ‌చ్చే సీట్లు బీజేపీకి క‌లిసివ‌స్తాయి.అందుకోసమే జగన్ తో బీజేపీ సన్నిహితంగా మెదులుతోంది.ఇక జగన్ కూడా బీజేపీకి అనుకూలంగా ఉండేలా కనిపిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube