ముందు ముందు జగన్ కు అన్నీ ఇబ్బందులేనా ?

ప్రస్తుతం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేదు.ఇప్పటి వరకు కు ఏ ప్రభుత్వం చేయని విధంగా అతి తక్కువ సమయంలోనే ఉద్యోగాల భర్తీ చేయడంతోపాటు, పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలను అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే అమలు చేశారు.

 Ap Cm Jagan Not Getting Support To Central Governament-TeluguStop.com

జగన్ తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నాడు.ఇంకా అనేక హామీలను అమలు చేయాల్సి ఉంది.

అయితే ఖజానా మాత్రం అందుకు సహకరించడం లేదు.అలా అని పథకాల అమలు వాయిదా వేసేందుకు కూడా జగన్ ఇష్టపడడం లేదు.

జగన్ తాను ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేసి తమ చిత్తశుద్ధిని వంద శాతం నిరూపించుకోవాలి అంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి.అయితే ఆ విషయంలో జగన్ కు సరైన సహకారం అందడం లేదు.

Telugu Ap Cm Jagan, Apcm, Central Jagan, Jaganlaunch, Jaganspeciall-Telugu Polit

  బిజెపి ప్రభుత్వం జగన్ కు సహకారం అందిస్తున్నట్లు కనిపించినా కీలక సమయంలో మాత్రం చేతులెత్తేస్తోంది.వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తుందో, వ్యతిరేకిస్తోందో స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొంది.దీనిపై వైసీపీ కూడా నోరుమెదపలేని పరిస్థితుల్లో ఉంది.ఒకవైపు రాష్ట్ర బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నా వారిని ధైర్యంగా విమర్శించే సాహసం జగన్ చేయలేకపోతున్నారు.

ఒకవైపు సి.బి.ఐ దుకుడు పెంచుతూ జగన్ ను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది.ఈ సమస్యలన్నిటికీ స్పష్టమైన పరిష్కారం కావాలంటే కేంద్ర పెద్దల మద్దతు అవసరమని జగన్ పదేపదే ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నా వారి అపాయింట్మెంట్ ఆయనకు లభించడం లేదు.

Telugu Ap Cm Jagan, Apcm, Central Jagan, Jaganlaunch, Jaganspeciall-Telugu Polit

  ఇటీవల ప్రధాని మోదీని జగన్ కలిశారు.అయితే వారిద్దరి మధ్య ఏ విషయం మీద చర్చ జరిగింది అనేది బయటికి రాలేదు.మరోసారి కేంద్ర హోంమంత్రి , బీజేపీ చీఫ్ అమిత్ షా ను కలిసేందుకు జగన్ ప్రయత్నించినా ఆయన అపాయింట్మెంట్ దొరక్క జగన్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడు.ఇక వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తమ ప్రధాన అజెండాగా భుజానికి ఎత్తుకుంది.

ఎన్నికల ప్రచారంలోనూ దీనిపై పై గట్టిగా మాట్లాడారు జగన్.ప్రత్యేక హోదా తీసుకువస్తామని తమకు 22 మంది ఎంపీలను ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకుంటామని అని జగన్ ప్రకటించారు.

Telugu Ap Cm Jagan, Apcm, Central Jagan, Jaganlaunch, Jaganspeciall-Telugu Polit

 

కానీ కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రకటించేసింది.అయినా జగన్ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం లేదు.వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారు.కానీ ఇప్పుడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కేంద్రం మాత్రం తన వైఖరి మార్చుకునే విధంగా కనిపించడంలేదు.

ఇది ఖచ్చితంగా ముందు ముందు జగన్ కు ఇబ్బందులు తీసుకురావచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube