శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు అధికారిక లాంఛనాలతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఢిల్లీ అధికారిక పర్యటన నిమిత్తం వెళ్ళిన సీఎం జగన్ అటు నుండి అటుగా నేరుగా తిరుపతి వెళ్లారు.

 Ap Cm Jagan Mohan Reddy Present Pattu Vastra For Lard Venkateshwara-TeluguStop.com

అక్కడ మంత్రులు నానితో పాటు టిటిడి అధికారులు మరియు బోర్డు సభ్యులు సీఎం జగన్ కి సాగర్ ఆహ్వానం పలికారు.స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ నేడు రాత్రి అక్కడే బస చేయనున్నారు.

రేపు తెల్లవారు జామున మరోసారి స్వామి వారిని దర్శించుకొని ఆ తర్వాత అమరావతి బయలుదేరనున్నారు.సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించే ముందు డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు మాత్రం డిక్లరేషన్ తప్పని సరి కాదంటూ పేర్కొన్నారు.

సీఎం జగన్ స్వామి వారి దర్శనానికి ముందు డిక్లరేషన్ లో సైన్‌ చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube