మండలిపై సీఎం సంచలన వ్యాఖ్యలు  

Ap Cm Jagan Mohan Reddy Comments On Assembly Mandali-ap Three Capitals,jagan

ఏపీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో పాస్‌ చేసుకుని మండలికి తీసుకు వెళ్లింది.అక్కడ బిల్లు సెలక్షన్‌ కమిటీకి పంపడంతో జగన్‌ ప్రభుత్వం ఆలోచనలో పడింది.

AP CM Jagan Mohan Reddy Comments On Assembly Mandali-Ap Three Capitals

మొన్నటి వరకు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి మండలిలో మెజార్టీ సభ్యులు ఉన్న విషయం తెల్సిందే.మండలిలో వైకాపాకు మెజార్టీ సభ్యులు దక్కాలి అంటే దాదాపు రెండున్నర మూడు సంవత్సరాలు అయినా పడుతుంది.

అప్పటి వరకు అసెంబ్లీలో ఏ బిల్లు చేసినా కూడా మండలిలో అడ్డుకునే అవకాశం ఉంది.

మండలిలో ప్రతి బిల్లును ఇలా సెలక్షన్‌ కమిటీకి పంపుకుంటూ పోతే ప్రభుత్వం ఏం చేయలేదు.

కనుక మండలిని రద్దు చేసే యోచనలో జగన్‌ ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.అన్నట్లుగానే జగన్‌ కూడా నేడు అసెంబ్లీలో మండలి విషయమై సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నాడు.

ప్రత్యేకంగా సోమవారం నాడు మండలిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అందుకు అనుమతించాల్సిందిగా కోరాడు.మండలిపై చర్చ జరిగితే రద్దుకు అసెంబ్లీ సిఫార్సు చేసే అవకాశం ఉంది.

అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఈ ఏడాది చివరి వరకు మండలి రద్దు అవ్వడం ఖాయం.జగన్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.

తాజా వార్తలు

Ap Cm Jagan Mohan Reddy Comments On Assembly Mandali-ap Three Capitals,jagan Related....