జగన్ కి జై కొట్టబోతున్న వైఎస్ ఆత్మ ?

ఏపీలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం .నిన్న జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం ఇవన్నీ ఆ పార్టీలో జోష్ నింపుతున్నాయి.

 Ap Cm Jagan Mohan Reddy Call Kvp Ramachandarao-TeluguStop.com

గత అసెంబ్లీ ఎన్నకల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నారు.కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రతిపక్షలోనే కూర్చోవాల్సి వచ్చింది.

జగన్ కూడా గతంలో వలె కాకుండా ఇప్పుడు చాలా ఒదిగి ఉన్నట్టు కనిపిస్తున్నాడు.ఒకప్పుడు తన ప్రవర్తన ద్వారా ఎవరెవరిని దూరం చేసుకున్నాడో ఇప్పుడు వారందరిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా పేరుపడ్డ కేవీపీ రామచంద్రరావు పేరు జగన్ పైకి తీసుకొస్తున్నారు.

వైఎస్‌ను సీఎంగా చేసిన పాదయాత్ర సలహా ఇచ్చింది కూడా కేవీపీనే అనే చర్చ నడుస్తోంది.

వైఎస్ హయాంలో ఎవరికి నిధులివ్వాలి.? వాటిని ఎక్కడి నుంచి తీసుకురావాలి .? వంటి కీలకాంశాలను ఆయనే చూస్తుండేవారు.వైఎస్ నిర్ణయం తీసుకుంటే అమలు బాధ్యత కేవీపీదే.

కేవలం ఈ అంశాలే కాదు వైఎస్సార్ కు సంబందించిన ప్రతి విషయంలోనూ ఆయన ఆత్మ తప్పకుండా జోక్యం చేసుకుంటూ ఉండేది.అయితే అనూహ్యంగా వైఎస్సార్ ఆత్మగా పేరుపడ్డ కేవీపీ రామచంద్రావు ప్రస్తావన జగన్ తీసుకొస్తుండం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

-Telugu Political News

అయితే విభజన తర్వాత కాంగ్రెస్‌లోనే ఉంటున్నప్పటికీ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.దీంతో అప్పుడప్పుడు గత ఏపీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడం.,బహిరంగ లేఖలు రాయడం వంటివి చేసేవారు తప్ప పెద్దగా రాజకీయ చురుకుదనం అయితే కనబరచలేదు.అయితే ఇప్పుడు ఆయనకు జగన్ నుంచి పిలుపు వచ్చిందని, త్వరలోనే వైసీపీలో కేవీపీ చేరడం దాదాపు ఖాయం అయిపొయింది.

దీనికి నిదర్సనంగా అన్నట్టు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి కేవీపీకి జగన్ స్వయంగా ఫోన్ చేసి పిలవడం, ఆయన హాజరవ్వడం జరిగిపోయాయి.తొందర్లోనే ఈ విషంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube