రూ.50 వేల కోట్లతో జగన్‌ కొత్త పథకం

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన ముద్రను వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.తండ్రి బాటలో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు.

 Ap Cm Jagan Launch The New Scheme With 50 Thousand Crores-TeluguStop.com

ఇక ఏపీలో వాటర్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది.అందుకోసం ఏకంగా రూ.50 వేల కోట్ల రూపాయలను కేటాయించబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.2022 నాటికి ఏపీలోని ప్రతి ఇంటికి కూడా కుల్లాయి ద్వారా మంచి నీటిని ఇచ్చే ఉద్దేశ్యంతో వాటర్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల వారు చెబుతున్నారు.

తెలంగాణలో మిషన్‌ భగీరధ పథకం మాదిరిగా ఏపీలో వాటర్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని జగన్‌ ప్రభుత్వం భావిస్తుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి.వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి నీరు ఇచ్చేందుకు ఈ పథకంను చాలా స్పీడ్‌గా నిర్మించాలని జగన్‌ భావిస్తున్నారు.ఈ విషయమై ఇప్పటికే ఇంజనీరింగ్‌ ప్రతినిధులతో కూడా ఒక కమిటీ వేసినట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి ఏపీ సీఎం ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి ఓట్లు అడుగుతాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube