కొవిడ్ మృతుల అంత్యక్రియలపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. !

కరోనాతో పోరాడి ఓడి మరణించిన వారి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే కోవిడ్‌తో మరణించిన మృత దేహాలకు దహన సంస్కారాలు నిర్వహించే వీలు లేకుండా పోవడంతో దిక్కు లేకుండా వారిని దహనం చేసే కొందరి వ్యక్తులు ఇంత అని ఒక ప్యాకేజీ పుచ్చుకుని అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

 Ap Cm Jagan Key Decision On Covid Funerals, Ap, Cm Jagan, Key Decision, Covid Fu-TeluguStop.com

కాగా డబ్బులు లేని పేదల పరిస్దితి మాత్రం దారుణంగా ఉంది.

ఈ క్రమంలో ఏపీ సీయం వైఎస్ జగన్ 2021-22 వ సంవత్సరానికి గాను కొవిడ్ మృతుల అంత్య క్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారు.ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారి చేశారు.

ఇకపోతే ఈ ఆర్ధిక సహయాన్ని అందించే అధికారాన్ని ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇచ్చారు.కాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేదరికంలో మరణించిన కోవిడ్ రోగుల కుటుంబాలకు కొంత ఊరట లభిస్తుందని అంచన వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube