ఆ విషయంలో కేసీఆర్ కంటే జగన్ బెటర్ అంటగా ?  

Ap Cm Jagan Kcr Coronavirus Tests - Telugu Ap Cm Jagan, Coronavirus Tests, Hyderabad, Kcr, Lock Down, Telangana Health Deportment, Telangana High Court

అసలే రెండూ తెలుగు రాష్ట్రాలు, అందులోనూ ఇద్దరు ముఖ్యమంత్రులు మంచి మిత్రులు.దీంతో సహజంగానే వారి పరిపాలనకు సంబంధించిన పోలికలు వస్తూ ఉంటాయి.

 Ap Cm Jagan Kcr Coronavirus Tests

ఏ ముఖ్యమంత్రి పనితీరు బాగుంది అనే విశ్లేషణలు మొదలవుతున్నాయి.రాజకీయంగా జగన్ కంటే కేసీఆర్ సీనియర్.

వ్యూహాలు రచించడం, సంక్షోభం నుంచి కూడా తెలివిగా తప్పించుకోవడం, ఎప్పుడు ఎక్కడ ఏ ఎత్తుగడ వేస్తే కలిసి వస్తుంది అనే అంశాలపై పూర్తిగా పట్టు ఉండడంతో, అన్ని విషయాల్లోనూ జగన్ కంటే పైచేయి సాధిస్తూ వస్తున్నారు.ఆ విధంగానే కరోనా సమయంలోనూ, లాక్ డౌన్ నిబంధనలు అమలు వంటి విషయాల్లోనూ, అందరికంటే కేసీఆర్ స్పందించిన తీరు బాగుందని, ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ జాగ్రత్తలు చెబుతూ, ప్రజలను అప్రమత్తం చేసే వారిని, ఈ విషయాల్లో కేసీఆర్ ని చూసి జగన్ చాలా నేర్చుకోవాలని అనేక వ్యాఖ్యలు వినిపించాయి.

ఆ విషయంలో కేసీఆర్ కంటే జగన్ బెటర్ అంటగా -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాకపోతే తెలంగాణలో కరోనా టెస్ట్ లు సరిగా చేయడం లేదని, కేసుల సంఖ్య తెలంగాణ ప్రభుత్వం దాచిపెడుతోందని, ఎప్పటి నుంచో విమర్శలు వస్తూనే ఉన్నాయి.ఇక ఈ వ్యవహారంలో హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వానికి చివాట్లు పెట్టడంతో ప్రభుత్వం ముందుకు కదిలింది.

కరోనా టెస్ట్ లు చేయడం మొదలు పెట్టడంతో పెద్దఎత్తున కేసులు నమోదు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.దీంతో ఒక్కసారిగా ర్యాండమ్ టెస్టులను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేయడం వివాదాస్పదమవుతోంది.

ఇప్పటి వరకు టెస్ట్ లో నిర్వహించినా, ఫలితాలు నిలిపివేశామని వైద్య శాఖ ప్రకటించింది.

టెస్ట్ లు చేస్తే ఫలితాలు కొద్దిగా ఆలస్యంగా వచ్చినా ఫర్వాలేదు అని, కానీ కేసుల సంఖ్య దాచిపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా చేస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు పెరిగిపోయాయి. హైదరాబాద్ లో పరిస్థితి అదుపు తప్పడంతో ఇప్పటికే స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను వ్యాపారులు అమలు చేస్తున్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే, ముందు ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోతోంది.

ఇక ఏపీ విషయానికి వస్తే సీఎం జగన్ మొదటి నుంచి కరోనా విషయంలో జాగ్రత్తగా ఉంటూ వస్తున్నారు.తరుచుగా మీడియా సమావేశాలు నిర్వహించకపోయినా, యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

కరోనా కట్టడి చర్యలు తీసుకుంటూ, కరోనా టెస్ట్ లు చేయించడం, పాజిటివ్ ఉన్నవారిని గుర్తించడం, వారికి ట్రీట్మెంట్ అందించడం, ఇలా అన్ని విషయాల్లోనూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వస్తున్నారు.దేశవ్యాప్తంగా కరోనా టెస్ట్ లు ఎక్కువ నిర్వహించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.మొదటి నుంచి కేసులను గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, వస్తున్న తీరుపై ఇప్పుడు దేశమంతా జగన్ ను ప్రశంసిస్తోంది.అంతే కాకుండా జగన్ తో కేసీఆర్ ను పోల్చి చూపించి ఆయన కంటే జగన్ బెటరని, ముందుచూపుతో వ్యవహరించి కేసులు కట్టడికి కృషి చేస్తున్నారని, ఈ విషయంలో జగన్ ను చూసి కేసీఆర్ చాలా నేర్చుకోవాలనే సూచనలు ఇప్పుడు పెరిగిపోతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Cm Jagan Kcr Coronavirus Tests Related Telugu News,Photos/Pics,Images..

footer-test