ముంచుకొస్తున్న ముప్పు ? పరిస్థితి చేయిదాటిపోతోందా ?

కరోనా వైరస్ ప్రభావం ప్రభావం రోజు రోజుకి పెరుగుతూ వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండడం, పరిస్థితి అదుపు తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది.

 Ap Governament Reduce The Lock Down Time, Ap Cm Jagan, India Lock Down, Corona V-TeluguStop.com

ముఖ్యంగా మొన్నటి వరకు ఏపీలో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా కనిపించకపోయినా, రెండు మూడు రోజులుగా ఈ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.ప్రస్తుతం ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 133 కి చేరింది.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సమర్థవంతంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు.కొద్ది రోజుల క్రితం తెలంగాణ నుంచి పోలీసుల అనుమతితో విద్యార్థులు, ఉద్యోగస్థులు భారీ సంఖ్యలో ఏపీ లోకి వచ్చేందుకు ప్రయత్నించినా, జగన్ వారిని నిర్మొహమాటంగా అడ్డుకున్నారు.

తిరిగి వారిని వెనక్కి పంపేశారు.దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా, జగన్ మాత్రం పట్టించుకోవాడంలేదు.

Telugu Ap Cm Jagan, Central, Corona, Delhi, India Lock, Markaz Muslims-Political

ఇక లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉదయం 06 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంట వరకు బయట తిరిగేందుకు అనుమతి ఇచ్చారు.అయితే దీనిని ప్రజలు దుర్వినియోగం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.రోడ్లపైకి విచ్చలవిడిగా వస్తుండడమే కాకూండా గుంపులు గుంపులుగా తిరుగుతూ రావడం, ఒకవైపు కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఇప్పుడు ఏపీలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు బయట తిరిగే సమయాన్ని కుదించారు కుదించారు.ప్రజలు బయటకు వచ్చినా వారి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అని ముందు అనుకున్నా, పరిస్థితి చేయి దాటి పోతుండడం, ఢిల్లీ మాత ప్రార్థనలకు వెళుతున్న వారి వల్ల మరింత ముప్పు ఏర్పడటంతో ప్రభుత్వం అప్రమత్తమై లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తోంది.

Telugu Ap Cm Jagan, Central, Corona, Delhi, India Lock, Markaz Muslims-Political

నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారిలో ఇప్పటికే 500 మందిని గుర్తించి వారందరినీ క్వరంటైన్ కు తరలించారు.వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.దీంతో మరింత కఠినంగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తోంది.అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తుండడంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించే విధంగా ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ప్రస్తుతం ఏపీ లో నమోదైన కరోనా కేసులు 143 ఉండగా, దాదాపు 120 పైగా కేసులు ఢిల్లీ మార్కజ్ ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారి వల్లే ఈ పరిస్థితి ఏర్పడడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.సీఎం జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు తగిన సూచనలు ఇస్తున్నారు.

అధికారులతో పాటు ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తతతో వ్యవహరించకపోతే పరిస్థితి మరింత చేయి దాటి పోయే అవకాశం లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube