స్నేహలత కుటుంబం కు రూ.10 లక్షలు, 5 ఎకరాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న అనంతపురం జిల్లా దర్మవరం కు చెందిన స్నేహాలతను ప్రేమ పేరుతో రోజు వెంటపడి వేధిస్తున్న రాజేష్, కార్తీక్ అనే యువకులు హత్య చేశారు.డిసెంబర్ 22 నాడు ఆఫీసు కు వెళ్ళిన స్నేహలత రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి తండ్రులు పోలీసు లకు ఫిర్యాదు చెయ్యడంతో ఆమె కోసం వెతుకుతున్న పోలీసులకు ఊరి చివర బాదనపల్లి వద్ద ఆమె శవమై కనిపించింది.

 Ap Cm Jagan Help The Snehalath Family,ananthapuram,ap Cm, Jagan, Rajesh,sbi,sneh-TeluguStop.com

ఈ ఘటనపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్నేహలత కుటుంబంకు తన ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా సహాయంను ప్రకటించాడు.

ఆమెకు చట్ట పరంగా రావాలిసిన దానికంటే అదనంగా సాయం ప్రకటించాడు.

ఈ విషయాన్ని మంత్రి శంకర్ నారాయణ తెలిపాడు.అదే విదంగా కేస్ విచారణ ను అతిత్వరగా పూర్తి చేయాలని జగన్ ఆదేశించినట్టు శంకర్ నారాయణ చెప్పారు.

స్నేహలత కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం.ఇంటి స్థలంతో పాటుగా వ్యవసాయం చేసుకోవడానికి 5 ఏకరాల పొలం కూడా ఇస్తున్నట్లు మంత్రి చెప్పాడు.తక్షిణ సాయంగా 4.12 లక్షల రూపాయలను అందించాడు.స్నేహలత హత్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టి‌డి‌పి అధినేత చంద్రబాబు స్పందించారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బాబు అన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube