పాడిరైతులకు లబ్ది చేకూరేలా కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్.. !

ఏపీ సీఎం జగన్ పాడిరైతులకు లబ్ది చేకూరేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జగనన్న పాల వెల్లువ పథకానికి శ్రీకారం చుట్టారు.

 Ap Cm Jagan Has Taken A Crucial Decision To Benefit The Milk Farmers-TeluguStop.com

ఇప్పటికే ఎన్నో పధకాలతో ప్రజల హృదయాల్లో నిలిచిన జగన్ తాను చేసిన పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు స్వయంగా చూశానని, అప్పుడే వారికి హమీ ఇచ్చానని తెలిపారు.అందుకే వీరికి లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

 Ap Cm Jagan Has Taken A Crucial Decision To Benefit The Milk Farmers-పాడిరైతులకు లబ్ది చేకూరేలా కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక పాడి రైతులకు ఇచ్చిన హామీ మేరకు అమూల్ ప్రాజెక్టును తీసుకొచ్చామని, ఇక నుండి పాలు పోసే అక్కచెల్లెమ్మలంతా అమూల్ సంస్థలో వాటాదారులేనని తెలిపారు.కాగా అమూల్ ప్రాజెక్టు ద్వారా పాడి రైతులకు లీటరుకు అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు వచ్చేలా చూస్తామని వెల్లడించారు.ఇక ఇప్పటికే ఈ పాల సేకరణ ప్రకాశం, కడప, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరుగుతోందని, నేటి నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని 153 గ్రామాల్లో అమూల్ సంస్థ పాల సేకరణ మొదలు పెట్టినట్లుగా తెలిపారు.అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 9,899 గ్రామాలకుఈ ప్రాజెక్ట్ విస్తరిస్తామని పేర్కొన్నారు.

#Benefit #Amul #Crucial #AP CM Jagan #Milk Farmers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు