టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో క్లారిటీ ఇచ్చేసిన జగన్..!! 

ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి “జగనన్న వసతి దీవెన పథకం” కింద విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి సీఎం జగన్ డబ్బులు వేయడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

 Ap Cm Jagan Given Clarity In Tenth And Inter Exams , Ys Jagan, Corona Second Wav-TeluguStop.com

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కొంత మంది విద్యార్థుల పరీక్షల విషయంలో పొలిటికల్ మైలేజీ సంపాదించడం కోసం విమర్శలు చేస్తున్నారని .అది సరైన విధానం కాదని తెలిపారు.ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని .రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించడానికి ఏమాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

పరీక్షల విషయానికి సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించడంతో .ఇతర రాష్ట్ర విద్యార్థులతో పోటీ పడుతూ మన రాష్ట్ర విద్యార్థులు కూడా చదువులో రాణించాలంటే కచ్చితంగా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.పరీక్షలు నిర్వహించ కూడదు అని చెప్పడం సులువే.కానీ పాస్ మార్కుల సర్టిఫికెట్లతో భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలి అంటే అది చాలా కష్టం. ఉన్నత విద్యా సంస్థలలో సీట్లు వచ్చే పరిస్థితి ఉండదు.దీంతో విద్యార్థి భవిష్యత్తుకు కూడా.

కొంత నష్టం చేసిన వారం అవుతాం అని జగన్ అన్నారు.ఇదే క్రమంలో దేశంలో అనేక రాష్ట్రాలలో.

పరీక్షలు కూడా నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని.

పరీక్షలు నిర్వహిస్తామని.కరోనా పై గెలుస్తామని జగన్ అన్నారు.

ఇదే క్రమంలో “జగన్ అన్న వసతి దీవెన” మరియు “అమ్మఒడి పథకం” గురించి ఇంకా అనేక విషయాలు ఈ సందర్భంగా తెలియజేశారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube