రైతులకి అది జరగదని తేల్చేసిన వైసీపీ! ఇక ఆశలు వదులుకోవాల్సిందే  

రైతు రుణమాఫీ పెండింగ్ బ్యాలెన్స్ ఇచ్చే అవకాశం లేదంటున్న వైసీపీ నేతలు. .

Ap Cm Jagan Don\'t Give Assurance For Rythu Runamafi-chandrababu,former\\'s,rythu Runamafi,tdp,ysrcp

తాజా ఎన్నికలలో వైసీపీ భారీ ఆధిక్యం సొంతం చేసుకొని ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఎవరు ఊహించని విధంగా అంచనాలు తారుమారు చేస్తూ అద్బుతమైన విజయాన్ని అందుకున్న వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత నుంచి తన నవరత్నాలు అమలు చేయడం మీద ద్రుష్టి పెట్టాడు. అలాగే పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలని నెరవేర్చే పనిలో ఉన్నారు..

రైతులకి అది జరగదని తేల్చేసిన వైసీపీ! ఇక ఆశలు వదులుకోవాల్సిందే-AP CM Jagan Don't Give Assurance For Rythu Runamafi

దానికి గాను ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన విధానాలు జారీ చేయడం జరిగింది. ఇక ఇప్పటికే మంత్రి వర్గ ఏర్పాటు కూడా జరిగిపోయింది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం అయిపోయాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు గతంలో టీడీపీ పార్టీ ఇచ్చిన హామీలలో రైతుల రుణమాఫీ మరో రెండు విడతలు విడుదల జరగలేదు.ఇక రుణమాఫీ మీద ఆశలు పెట్టుకున్న రైతులకి చంద్రబాబు ఊహించని విధంగా మోసం చేసి విడతల వారీగా రుణమాఫీ అని చెప్పి ఐదేళ్ళ కాలంలో కేవలం మూడు విడతలలోనే రుణాలు మాఫీ చేసి మరో రెండు విడతలు వదిలేసాడు. ఇక మళ్ళీ అధికారంలోకి రాగానే రెండు విడతల రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలలోకి వెళ్ళాడు.

అయితే ప్రజలు అతను చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకొని ఓడించారు. అయితే ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించిన మిగిలిన రెండు విడతలు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విడుదల చేస్తుందా అనే డౌట్ చాలా మందికి వచ్చింది. దీనిపై కొంత మంది రైతులు ఓ మంత్రి దగ్గర రుణమాఫీ విషయాన్ని ప్రస్తావించగా చంద్రబాబు సర్కార్ హామీ ఇచ్చి నెరవేర్చని ఎ పథకాలకి వైసీపీ ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండదని, ఆ హామీలు నెరవేర్చే అవకాశమే లేదనే స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తుంది.

దీంతో రైతు రుణమాఫీకి సంబంధించి మిగిలిన రెండు విడతలు బ్యాలెన్స్ మీద రైతులు ఆశలు వదులుకోవాల్సిందే అనే మాట వినిపిస్తుంది.