జగన్ అసలు బాధ అదేనా ? కేసీఆర్ కూడా ఇబ్బంది పెడుతున్నాడా ?  

Ap Cm Jagan Corona Kcr Telangana Lockdown Extension - Telugu Ap Cm Jagan, Corona, Kcr, Lockdown Extension, Telangana

అధికారం చేపట్టి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు.అప్పుడే రాజకీయంగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు.

 Ap Cm Jagan Corona Kcr Telangana Lockdown Extension

ఆర్థికంగా ఏపీ పీకల్లోతు కష్టాల్లో ఉండడం, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కారణంగా ఏపీలో ఆర్థిక కష్టాలను జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది.ఇది ఇలా ఉండగానే పుండు మీద కారం చల్లి నట్లు కరోనా వైరస్ వ్యవహారం ఏపీ ప్రభుత్వాన్ని మరింత చిక్కుల్లో పడేసింది.

ఇప్పటికే నలువైపులా చుట్టుముట్టిన ఆర్థిక కష్టాల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియక సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వానికి కరోనా వైరస్ రూపంలో పెద్ద చిక్కే వచ్చిపడింది.మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధన కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.

జగన్ అసలు బాధ అదేనా కేసీఆర్ కూడా ఇబ్బంది పెడుతున్నాడా -Latest News-Telugu Tollywood Photo Image

వర్తక వాణిజ్య కార్యకలాపాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వర్గాలు మాత్రం మూసుకుపోయాయి.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని జగన్ కు లాక్ డౌన్ ఇబ్బందికరంగా తయారైంది.

ఒకవైపు కరోనా వ్యాప్తి చెందకుండా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తాను అమలు చేసిన సంక్షేమ పథకాలకు నిధుల కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్ పై పడింది.

ఏప్రిల్ 14వ తేదీ నుంచి లాక్ డౌన్ ఎత్తివేత ఉండడంతో యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించవచ్చు అని జగన్ భావిస్తుండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.ఇదే జగన్ కు మింగుడు పడడం లేదు.

తాజాగా లాక్ డౌన్ నిబంధనలు మరి కొంతకాలం పొడిగించాలని కేంద్రాన్ని కోరినట్లు కెసిఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు.ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ అమలు చేయాలని, లేకపోతే ఇండియా పరిస్థితి ఇటలీ, అమెరికా, స్పెయిన్ తరహాలో తయారవుతుందని కెసిఆర్ అభిప్రాయపడుతున్నారు.

దీనికి చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు తెలుపుతున్నారు.

అంటే లాక్ డౌన్ నిబంధన మరికొంతకాలం పొడిగించాలంటూ వస్తున్న ప్రతిపాదనలను కేంద్రం కూడా పరిగణలోకి తీసుకుంటే జగన్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవు.మిగతా రాష్ట్రాల్లో ఈ నిబంధన పాటించినా ఏప్రిల్ 14 తర్వాత ఏపీలో ఈ నిబంధన ఎత్తివేయాలని జగన్ చూస్తున్నారు.కేవలం హాట్ స్పాట్స్, రెడ్ జోన్ ఏరియాల్లో మాత్రమే కొనసాగించి మిగతా చోట్ల ఎత్తి వేయాలని జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

దీని వల్ల ఏపీకి ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.అలాగే సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో యధావిధిగా నిషేధం కొనసాగించి మిగతా చోట్ల ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే కెసిఆర్ మాత్రం లాక్ డౌన్ మరి కొన్ని నెలల పాటు పొడిగించాలంటూ ప్రధానిని డిమాండ్ చేస్తుండడం జగన్ కు ఇబ్బందికరంగా మారింది.

ఒకవేళ ఏపీలో కనుక మరికొంత కాలం లాక్ డౌన్ ను పొడిగిస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

అసలు మార్చి 31వ తేదీతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కేంద్రం ఎత్తి వేస్తుందని జగన్ భావించారు.కానీ ఢిల్లీ మార్కజ్ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగా ఏపీ లో ఈ విధంగా వైరస్ ప్రభావం పెరిగిపోయింది.

ఇప్పటికీ పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.ఈ తరుణంలో లాక్ డౌన్ ఎత్తివేస్తే మరింతగా ఇబ్బందికర పరిణామాలను ఏపీ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..