జగన్ సర్కార్ కీలక నిర్ణయం, స్కూల్స్ ఓపెనింగ్ ఇక ఆగస్టే  

Ap Cm Jagan Ap Schools Lock Down - Telugu Ap Cm Jagan, Ap Government, Ap Schools, Ap Schools Re Cunstruct, Lock Down, Clases, Sand And Cement

ఏపీ లో స్కూల్స్ కు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తుంది.మార్చి 22 నుంచి ఇప్పటివరకు లాక్ డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం విదితమే.

 Ap Cm Jagan Ap Schools Lock Down

లాక్ డౌన్ సడలింపుల్లో కూడా స్కూల్స్,మాల్స్,థియేటర్స్ ను మాత్రం తెరిచే ప్రసక్తిలేదని కేంద్రం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ తాజాగా ఆగస్టు నుంచి స్కూల్స్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.రాష్ట్రంలో నాడు-నేడు కింద అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంది అని, జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో ఈ అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు.9 రకాల సదుపాయలను అన్ని స్కూళ్లలో కల్పించాల్సి ఉందన్నారు.

దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా విడుదల చేశామన్నారు.జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలని.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం, స్కూల్స్ ఓపెనింగ్ ఇక ఆగస్టే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ పనులపై కలెక్టర్లు ప్రతిరోజూ రివ్యూ చేయాలని సీఎం కోరారు.ఈ పనులకోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలుస్తుంది.

గత రెండు నెలలుగా స్కూల్స్ లేకపోవడం తో విద్యార్థులు అందరూ కూడా ఇళ్లకే పరిమితమై ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే కరోనా మహమ్మారి కారణంగా మరి కొద్దీ నెలల పాటు ఈ ఆన్ లైన్ క్లాసులను కొనసాగించి ఆగస్టు నుంచి తిరిగి పాఠశాలను పునఃరుద్దరించాలని ఏపీ సర్కార్ భావిస్తుంది.

అయితే దీనికి సంబంధించి సరైన స్పష్టత రావాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు