రెండు నగరాల్లో అక్రమ నిర్మాణమేనా...!

తాను అత్యంత నీతిపరుడినని, అవినీతిని సహించనని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అంత సీన్‌ లేదని ఈమధ్య జరిగిన ఘటనలు తెలియచేస్తున్నాయి.నోటుకు ఓటు కేసులో ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని దుమారం రేగుతోంది.

 Ap Cm House Not Legal-TeluguStop.com

దానికి తగ్గట్లు ఆడియో టేపులు కూడా బయటపడ్డాయి.అదే సమయంలో హైదరాబాదులో ఆయన నిర్మించుకుంటున్న ఇంటి నిర్మాణం ప్లాన్‌ ప్రకారం లేదని, నిబంధనలు ఉల్లంఘించి కడుతున్నారని జిహెచ్‌ఎంసీ అభ్యంతరం వ్యక్తం చూస్తూ ఇంటి నిర్మాణం ఆపిన సంగతి తెలుసు.

బాబు హైదరాబాదులోనే కాకుండా విజయవాడలోనూ ఇల్లు కట్టుకుంటున్నారు.ఇది కూడా నిబంధనలు ఉల్లంఘించి కడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

నిబంధనలు ముఖ్యమంత్రికి ఓ విధంగా, పేదవారికి మరో విధంగా ఉంటాయా అని సీపీఎం నాయకులు ప్రశ్నిస్తున్నారు.కృష్ణా నది ఒడ్డున ముఖ్యమంత్రి ఇంటి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న అధికారులు కృష్ణా కాలువ పక్కన ఉన్న పేదల గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విజయవాడ సీపీఎం నాయకులు ఆరోపించారు.

ఇళ్లు తొలగిస్తామంటూ అధికారులు వెయ్యి కుటుంబాలకు నోటీసులు జారీ చేశారని చెప్పారు.భాజపా, టీడీపీ కృష్ణా ఫ్లడ్‌ బ్యాంక్‌్స వద్ద రాష్ర్ట కార్యాలయాలు నిర్మించాలని ప్రయత్నిస్తున్నాయని, ఇది నిబంధనలకు విరుద్ధమని అన్నారు.

కేవలం ఈత కొలను కడతామని అనుమతి తెచ్చుకొని సీఎం ఇల్లు కడుతున్నారని ఆరోపించారు.సీపీఎం నాయకులు చెప్పింది నిజమే అయితే సీఎం ఇంటి నిర్మాణం కోసం నిబంధనలు ఉల్లంఘించినట్లే.

బూర్జువా పార్టీల మాదిరిగా కమ్యూనిస్టులు ఊరికే ఆరోపణలు చేయరు కదా….!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube