బాబు అంటేనే రాజకీయం ! ఇప్పటికైనా తెలిసొచ్చిందా...?       2017-11-13   01:23:43  IST  Bhanu C

రాజకీయం ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో బాగా తెలిసిన వాడు ఎవరన్నా ఉన్నారా అంటే అది చంద్రబాబే అన్న సంగతి చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. ఎక్కడ తగ్గాలో తెలియడమే కాదు ఎక్కడ నెగ్గాలో కూడా చంద్రబాబుకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ని రాజకీయాంగా దెబ్బకొట్టాలని ప్రయత్నించిన రెండు పార్టీల నాయకులకు గట్టి షాక్ ఇచ్చి తానేంటో నిరూపించుకున్నాడు బాబు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ విషయంలో ఏపీకి క్రెడిట్ రాకుండా చేయాలనీ కేంద్రం ఎన్నో కొర్రీలు పెడుతూ వస్తోంది. పోలవరం కనుక పూర్తయితే తెలుగుదేశానికి ఇక తిరుగుండదు తాము రాజకీయంగా ఎదగలేము అని భావించిన బీజేపీ పెద్దలు ఇబ్బందులు పెడుతూనే వస్తున్నారు. విభజన చట్టంలో భాగంగా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని కేంద్రమే భరించినా నిర్మాణ బాధ్యతల్ని మాత్రం రాష్ట్రానికి అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్రం దశ, దిశ మారతాయని భావించిన చంద్రబాబు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రతి సోమవారం పోలవరం మీద సమీక్ష చేస్తూ నిర్మాణ పనులను పరుగులెత్తించారు. కానీ కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ ట్రాయ్ ఆర్ధిక సామర్ధ్యం సరిపోదనే భావంతో కొత్త కాంట్రాక్టర్ కి పనులు అప్పగించాలి అనుకున్న చంద్రబాబుకి కేంద్రం ఏదో ఒక రూపంలో అడ్డు తగులుతూనే ఉంది.

కనీసం కాపర్ డ్యామ్ అయినా స్పీడ్ గా పూర్తి చేయాలని కొత్త టెండర్లు పిలిచి పని స్పీడ్ గా చేయించాలని బాబు భావించారు. అయితే చంద్రబాబు స్పీడ్ కి బ్రేకులేసే ఉద్దేశంతో అసలు కాపర్ డ్యామ్ అవసరం లేదని, డిజైన్ మారుద్దాం అని కేంద్రం కొత్త మెలిక పెట్టడంతో వైసీపీ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుని ఆనందంలో ఉండగానే చంద్రబాబు అందరికి చెంప చెళ్లుమని అనిపించేలా డైలాగ్ వేసాడు.

రాష్ట్రం ఖర్చులతో అయినా ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పడమే కాకుండా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ బాబు చేసే పనికి అడ్డం పడితే పోలవరానికి డబ్బులు ఇవ్వకపోగా పని చేస్తుంటే అడ్డం పడుతుందనే అపవాదు బీజేపీ కి తప్పదు. ఈ విషయం గమనించే అప్పటిదాకా బాబుని ఏకే బీజేపీ నేతలు సైతం ఢిల్లీ వెళ్లి గడ్కరీ తో పోలవరం పనులు ఆపొద్దని కాళ్లావేళ్లా పడ్డారు. వైసీపీ మాత్రం బాబు రాష్ట్రం డబ్బులతో పోలవరం పూర్తి చేస్తాననడం మీద ఎలా స్పందించాలో అర్ధం గాక తన అనుకూల మీడియాలో ఏపీ మీద ఆర్ధిక భారం అని కధనాలు రాస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.