కెసీఆర్ దగ్గరకు వెళ్ళబోతున్న చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ను స్వయంగా వెళ్లి ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు.శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 Chandrababu To Invite Kcr For Amaravati Foundation Ceremony-TeluguStop.com

చంద్రబాబు మంచి నిర్ణయమే తీసుకున్నారు.ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే విమర్శలు వచ్చేవి.

కెసీఆర్ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి.సాటి తెలుగువాడు.

మొన్నటివరకు కలిసి వున్నవాడు.ఒకప్పుడు టీడీపీ నాయకుడు.

బాబు మంత్రివర్గంలో పనిచేసినవాడు.కాబట్టి స్వయంగా వెళ్లి పిలిస్తేనే బాబు మంచి పని చేసాడనే పేరు వస్తుంది.

అప్పుడు బంతి కెసీఆర్ కోర్టులో ఉంటుంది.బాబు మర్యాదగా పిలిచిన తరువాత వెళితే గౌరవంగా ఉంటుంది.

బాబు ఆహ్వానం అందగానే ఏం చేయాలని కెసీఆర్ ఇప్పటికే తర్జన భర్జన పడుతున్నట్లు వార్తలు వచ్చాయి.వెళ్లాలని అనుకోకపోతే అందుకు చెప్పుకోవడానికి కారణాలు వెదుక్కోవాలి.

చూడాలి ఏం చేస్తారో.వై కా పా అధినేత వై ఎస్ జగన్ సహా ఇతర ప్రతిపక్ష నాయకులను ఎలా ఆహ్వానిస్తారో ఇంకా తెలియలేదు.

దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు.సమయం దగ్గర పడుతున్నది కాబట్టి పనులు వేగంగా జరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube