ఏపీ క్యాబినెట్ మీటింగ్ ... కీలక నిర్ణయాలు ఇవే !

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం రాత్రి జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో అనేక కీలక అంశాల గురించి నిర్ణయాలు తీసుకున్నారు.నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ మీటింగ్ లో అనేక అంశాల గురించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 Ap Cm Chandrababu Takes Desistions In Ap Cabinet Meeting-TeluguStop.com

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.వంశధార నిర్వాసితులపై పెట్టిన కేసుల ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్రత్యేక హోదాపై కీలక చర్చ జరిగింది.ఫిబ్రవరి 8న మరోసారి మంత్రివర్గ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

కీలక నిర్ణయాలు ఇవే…!

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.ఈ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టడానికి నిర్ణయం.అగ్రవర్ణాలకు అమల్లోకి వచ్చిన 10 శాతం రిజర్వేషన్ల నుంచే వీటిని కేటాయించాలని నిర్ణయం.అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం చెల్లింపుపై కీలక నిర్ణయం.హైకోర్టులో రూ.250 కోట్లు డిపాజిట్‌ చేసి అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాలని, ఆస్తుల వేలం తర్వాత ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయం.సెలూన్లకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.సమైక్యాంధ్ర ఉద్యమం నాటి మిగిలిన కేసులు ఎత్తివేయాలని నిర్ణయం.పసుపు – కుంకుమ పథకం నిధుల పంపిణీకి, చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం.‘భూధార్‌’ ప్రాజెక్టుకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి నిర్ణయం.రాజధాని ఆర్థిక ప్రణాళికకు కేబినెట్ ఆమోదం.

బేడా, బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలన్న శర్మ కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం.వంశధార నిర్వాసితులపై పెట్టిన కేసుల ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం జయహో బీసీ సదస్సులో ఇచ్చిన హామీలపైనా మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది.

హామీలకు సంబంధించి వెంటనే జీవోలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube