చంద్రబాబు వ్యూహాలతో మోడీ “ఉక్కిరిబిక్కిరి”     2018-04-23   01:15:42  IST  Bhanu C

-

-

“ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు”..ఇది బాగా పాపులర్ డైలాగ్ అయితే ట్రెండు మారింది కదా చంద్రబాబు కి మోడీ కి మధ్య జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో సోషల్ మీడియాలో ఓ డైలాగు బాగా ప్రచారం పొందుతోంది అదేంటంటే “బాబు తో పెట్టుకుంటే మోడీ కి మడతే” ఈ డైలాగు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హల్చల్ చేస్తోంది..అవును ఇది నిజంగా వాస్తవం మోడీ పై చంద్రబాబు చేస్తున్న ధర్మ యుద్ధం కేంద్రం గుండెల్లో రైళ్ళు పరిగేట్టిస్తోంది. మొన్న చంద్రబాబు చేసిన దీక్షకి వచ్చిన రెస్పాన్స్ మాములుగా లేదు యావత్ దేశం మొత్తం ఏపీ వైపే చూసింది.

ఒక రాష్ట్రానికి సీఎం గా ఉన్న వ్యక్తి తన రాష్ట్ర ప్రజలకోసం ,రాష్ట అభివృద్ధి కోసం పరితపిస్తూ కేంద్రం చేస్తున్న వెన్నుపోట్ల పై యుద్ధం చేయడం సాధారణ విషయం కాదు అందుకే చంద్రబాబు యావత్ దేశంలో మోడీ కి వ్యతిరేకులుగా ఉన్న పార్టీల నేతలకి మార్గదర్సకుడు అయ్యాడు..ఏపీలో చేస్తున్న నిరసనలని ఢిల్లీ లో ఉన్న రాజకీయ పార్టీలు సైతం అమలు చేయడంతో మోడీ కి వెన్నులో వణుకు మొదలయ్యింది..ప్రధానమైన డిమాండ్లపై మోడీ పై ఒత్తిడి పెంచేలా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. మోడీ ని ఎదుర్కుంటున్న ఏకైక వ్యక్తీ చంద్రబాబు ఒక్కడే అని ఫిక్స్ అయిన ఢిల్లీ లోని వివిధ పార్టీల నేతలు చంద్రబాబు ఏమి చెప్పినా చేయడానికి సిద్దం అంటున్నారట.

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ సీనియర్ నేత అయిన గులాంనబీ ఆజాద్‌ వివిధ పార్టీల నేతలు సమావేశమై ఈ మేరకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కాంగ్రెస్‌తోపాటు భావసారూప్యత కలిగిన ఇతర రాజకీయ పార్టీలన్నింటినీ కలుపుకోనిపోవాలని నిర్ణయించారు…మోడీ పై చంద్రబాబు ఏపీలో చేస్తున్న నిరసనలు కేంద్రంలో అక్కడ కూడా చేపడితే తప్పకుండా మోడీ మేడలు వంచవచ్చు అనే టాక్ వినిపిస్తోంది..ఈ విషయంపై చంద్రబాబు సూచనలు కూడా తీసుకున్నారట..

చంద్రబాబు దీక్ష జరుగుతున్న సమయంలో పలువురు నేతలు ఢిల్లీ నుంచీ ఫోన్ చేశారట..మీ కు మా మద్దతు ఉంటుందని ఇక్కడ కూడా నిరసనలు ఉదృతం చేస్తామని హామీ ఇచ్చారట..చంద్రబాబు కూడా తన వ్యుహాలని సఒక్కొక్కటిగా మోడీ పై వదలడానికి సిద్దం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది..అయితే ఢిల్లీ లో ఉన్న నేతలు ఏపీ కి సంభందిచిన విభజన హామీలపై, హోదా పై ఓ లేఖని మోడీ కి సంధించనున్నారని తెలుస్తోంది..అయితే అక్కడ ఢిల్లీ నేతలు తమదైన శైలిలో చంద్రబాబు సూచనలతో ముందుకు వెళ్తుంటే ఏపీలో చంద్రబాబు రచిస్తున్న తాజా వ్యూహాలతో మోడీ గుండె జారి మొకాలులోకి వస్తోందట. అదేంటంటే

త్వరలోనే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్రాలని నిర్వహించనున్నారని తెలుస్తోంది..అంతేకాదు సైకిల్ యాత్రలతో పాటు తిరుపతి లో ఓ భారీ బహిరంగ సభ ని నిర్వహించి ఏపీ ప్రజల సత్తా తెలుగుదేశం పార్టీ సత్తా ఏమిటో రుచి చూపించానున్నారు. ఈ రెండు కార్యక్రమాలతో మోడీ ని మరోసారి దేశ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనేది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది..మరి చంద్రబాబు ఇంకెన్ని ట్విస్ట్ లు మోడీ కి ఇవ్వనున్నారోనని తెగ మధన పడుతున్నారు బీజేపి నేతలు.