బాబు అంటేనే వణికి పోతున్న సీనియర్స్   Chandrababu Shocking Decisioins     2017-10-26   04:12:54  IST  Bhanu C

సీనియర్ నాయకులకి తెలుగుదేశం పార్టీలో మూడినట్టే కనిపిస్తోంది తెలుగుదేశం లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే.. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచీ ఇప్పటివరకు ఉన్న సీనియర్స్ ని బాబు దూరం పెడుతున్నాడట.. పార్టీకోసం ఎంతో అంకిత‌భావంతో ఉన్న ఓ సీనియ‌ర్ లీడ‌ర్‌, మాజీ మంత్రిని చంద్ర‌బాబు సైడ్ చేసేస్తున్నారు. అలాంటి వ్య‌క్తుల్లో రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రి ఒక‌రు. రాజ‌మండ్రి సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు.

బుచ్చయ్య చౌదరి 2004, 2009 జరిగిన ఎన్నికల్లో వరుసగా ఓటమిని చవి చూసారు ..గత ఎన్నికల్లోనే బుచ్చయ్య కి టికెట్ ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకున్నారట చంద్రబాబు అయితే వరుసగా ఆ త‌ర్వాత బుచ్చ‌య్య నుంచి తీవ్ర‌మైన ప్రెజ‌ర్ రావ‌డంతో ఆయ‌న‌కు రూర‌ల్ సీటు ఇచ్చారు. రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయ‌న ఆస‌క్తి చూప‌లేదు.చివ‌ర‌కు అయిష్టంగానే రూర‌ల్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఎంతో అనుభవం ఉన్న భుచ్చయ్య ఆరుసార్లు గెలిచిన రికార్డు ఉంది తనకి ఈసారి మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు కానీ ఆ కోరిక నెరవేరలేదు.మొన్నటి మంత్రివర్గం విస్తరణ లో వస్తుందని ఆశించిన ఫలితం లేదు.

.ఈ పరిణామాలతో ఎంతో కలత చెందినా బుచ్చయ్య బాబుపై లేఖాస్త్రం సంధించి క‌ల‌క‌లం సృష్టించారు. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. త‌ర్వాత కాస్త కూల్ అయ్యారు. ఇక తాజాగా రాజ‌మండ్రి అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికి తెలుగుదేశం బాధ్య‌త‌ల‌ను ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు – గుడా ఛైర్మన్ గన్ని కృష్ణతో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసి వారికి అప్ప‌గించారు. ఇది ఇప్పుడు టీడీపీలో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.బుచ్చ‌య్య‌ను వ్యూహాత్మ‌కంగా రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం చేసేలా పార్టీ అధిష్టాన‌మే నిర్ణ‌యం తీసుకుంద‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది. ఇది బుచ్చ‌య్య‌కు ఘోర అవ‌మానం లాంటిదే. ఇక ఇటీవల జరిగిన పార్టీ సంస్థాగత కార్యవర్గంలో కూడా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప‌క్క‌న పెట్టేశారు. ఇటీవల కేఈ కృష్ణ మూర్తి విషయంలో కూడా కేఈ బాబుని పక్కన పెడుతున్నారు అని తెలుస్తోంది. మరి సీనియర్స్ ని బాబు ఇలా పక్కన పెట్టడం వెనుక మతలబు ఏమిటనేది చంద్రబాబుకు మాత్రమే తెలియాలి.