ముగిసిన బాబు గారి దీక్ష !  

బీజేపీ పార్టీనే టార్గెట్ గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు ఢిల్లీలో వివిధ పార్టీల నుంచి మద్దతు లభించింది. ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిన తరువాత బీజేపీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ హామీలు అమలు చేయాలంటూ… ఢిల్లీలో బాబు దీక్షకు దిగారు. మాజీ ప్రధాని దేవగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నిమ్మరసం ఇచ్చి బాబుతో దీక్ష విరమింపచేశారు.

Ap Cm Chandrababu Protest Ended-

Ap Cm Chandrababu Protest Ended

ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు దీక్ష కొనసాగింది. ఈ దీక్ష శిబిరానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ములాయం సింగ్‌ యాదవ్, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ తదితరులు ధర్మపోరాట దీక్ష మద్దతుగా బాబు ని కలిశారు.