ఎన్ని హామీలు అమలు చేసాడో చెప్పిన బాబు

ఎన్నికల్లో ప్రజల మద్దతు సంపాదించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నాడు.అందుకే ప్రజల్లో మద్దతు సంపాదించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాడు.

 Ap Cm Chandrababu Naidu Speek To Asembly-TeluguStop.com

దీనిలో భాగంగానే… ఇప్పటివరకు ఎన్ని హామీలు అమలు చేసామో లెక్కగట్టి మరీ చెప్తున్నాడు.మానిపెస్టోలోని 295 హామీలను తమ ప్రభుత్వం అమలు చేసిందని ప్రకటించాడు.

శాసనసభలో ఆయన ప్రసంగించిన సందర్భంగా ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు.

మానిఫెస్టో లో చెప్పని వాటిని కూడా అమలు చేశామని ఆయన అన్నారు.రైతుల రుణాలను మాఫీ చేశాం.డ్వాక్రా సంఘాలకు నిధులిచ్చాం.

ప్రజల వైద్య ఖర్చులు కనిష్ఠ స్థాయికి తీసుకొచ్చాం.బీసీలకు సబ్‌ప్లాన్‌ తెచ్చాం.

కాపులకు రిజర్వేషన్లు కల్పించాం.అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.

అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాం.అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేల కోట్లు కేటాయించాం.వృద్ధులు, వితంతువులను పూర్తిగా ఆదుకుంటున్నాం.

ఆటోలపై జీవితకాలపు పన్ను, ట్రాక్టర్లపై త్రైమాసిక పన్ను మినహాయించాం అంటూ చేసింది .చేయబోయేది చెప్పుకొచ్చాడు బాబు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube