ఏపీ ప్రజలంటే అంత చులకనా..?కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు     2018-01-19   05:44:09  IST  Bhanu C

ఏపీ ప్రజలు ఎంత మంచి వాళ్ళో కేసీఆర్ కి ఇంకా తెలిసి రావడంలేదు..అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్నతెలుగు ప్రజల్ని తన స్వార్ధ ప్రయోజనం కోసం విడదీసి తెలంగాణా రాష్ట్రాన్ని తానొక్కడే తెచ్చినవాడిలా బిల్డప్ ఇస్తున్నారు కేసీఆర్ అంటూ మండి పడుతున్నారు ఏపీ ప్రజలు..నిన్నా మొన్నటివరకూ ఏపీలో ఉన్న ఏ జనం అయితే కేసీఆర్ కి పాలాభిషేకం చేశారో..ఫ్లెక్సిలు పెట్టి తమ అభిమానం చాతుకున్నారో ఇప్పుడు వాళ్ళే కేసీఆర్ ని ఛీ కొడుతున్నారు..

ఏపీ ప్రజలని అవమానిస్తూ తెలంగాణా సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు పెద్ద దుమారం రేపుతున్నాయి..వివరాలలోకి వెళ్తే…నిన్న హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో నిన్న జరిగిన ‘ఇండియా టుడే కాంక్లేవ్‌’లో తెలంగాణను ఏపీతో పోల్చవద్దంటూ కేసీఆర్.. ఏపీ ప్రజలని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలకి ఏపీలో అనేకమంది తీవ్రమైన అభ్యంతరం తెలిపారు.. “మేము చాలా ముందున్నాం. ఆంధ్రప్రదేశ్‌ కంటే చాలాచాలా ముందున్నాం” అంటూ కేసీఆర్ మాట్లాడటం దారుణమని అంటున్నారు…అయితే ఈ విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు..

ఏపీ ప్రజలు చేతకాని వాళ్ళు ఏమి కాదని..సాటి సీఎం గా భాద్యత కలిగిన వ్యక్తిగా హుందాగా మాట్లాడటం ఎంతో మంచిది అని చంద్రబాబు కేసీఆర్ కి కౌంటర్ కామెంట్స్ చేశారు..కేసీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు..ఏపీ ప్రజలు చేతగానివాళ్లేం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల ప్రమేయం లేకుండానే విభజన చేశారని..అందరితో మాట్లాడి న్యాయం చేయాలంటే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు..అయితే ఏపీ ని విడదీసిన కేంద్రం ఎపీని పట్టించుకోవడంలో మాత్రం విఫలం అయ్యింది అని తెలిపారు చంద్రబాబు..అయితే రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలు విభజన చట్టానికి లోబడి మాకు రావాలని కానీ అలా ఎక్కడా జరగడం లేదని అన్నారు.
ఈ విషయంలో మాకు అన్యాయం జరుగుతోందని..మాకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే సుప్రీంకోర్టు కి వెళ్లి న్యాయం అడుగుతామని అన్నారు…సుప్రీంకోర్టు లో మాకు తప్పకుండ న్యాయం చేకూరుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు..ఇకనైనా ఏపీ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ఆచి తూచు మాట్లాడాలని..తెలంగాణలో ఎంతో మంది తెలుగు ప్రజలు ఉన్నారు అన్న విషయం మర్చిపోవద్దు అని గుర్తు చేశారు చంద్రబాబు.