రాజీనామాకు సిద్దం అయిన చంద్రబాబు నాయుడు  

Ap Cm Chandra Babu Naidu Resign రాజీనామా-cm Cbn,cm Jagan,tdp,tdp Vs Ysrcp,ysrcp,చంద్ర బాబు రాజీనామా,మాజీ సి‌ఎం చంద్ర బాబు నాయుడు,సి‌ఎం జగన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరి కొద్ది సేపట్లో తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దం అయ్యారు. గవర్నర్‌ నరసింహన్‌ అపాయింట్‌మెంట్‌ను కోరిన చంద్రబాబు నాయుడు తన రాజీనామా పత్రంను సమర్పించబోతున్నాడు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది..

రాజీనామాకు సిద్దం అయిన చంద్రబాబు నాయుడు-Ap Cm Chandra Babu Naidu Resign రాజీనామా

ప్రత్యేక ఏపీకి మొదటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే చంద్రబాబు నాయుడు రెండవ దఫా నిలువలేక పోయాడు. అయిదు సంవత్సరాలు మాత్రమే చంద్రబాబు నాయుడు సీఎంగా నిలిచాడు. వైఎస్‌ జగన్‌ ప్రభంజనం ముందు నిలువడంలో చంద్రబాబు నాయుడు విఫలం అయ్యాడు.

మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో మీడియా ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత తన రాజీనామా పత్రంను గవర్నర్‌ నరసింహన్‌కు అందిస్తాడు.

సీఎంగా రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం అవుతాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

మళ్లీ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు 2024లో రానున్నాయి. అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయి, రాజకీయ పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేం. అందుకే మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడం కష్టమే అని, ఆయన వయసు రీత్యా కూడా ఇక అసాధ్యం అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.