టీడీపీ నేత నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.ఈ మేరకు అక్టోబర్ 4వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో నారా లోకేశ్ ఏ14 గా ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన సీఐడీ అధికారులు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లారు.
అయితే లోకేశ్ తన నివాసంలో లేరని చెప్పడంతో సస్పెన్స్ నెలకొంది.ఈ క్రమంలోనే లోకేశ్ కు వాట్సాప్ ద్వారా సీఐడీ అధికారులు నోటీసులు పంపారు.
హైకోర్టు సూచనల మేరకు 41 ఏ కింద సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని సమాచారం.