బిగ్ బ్రేకింగ్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని ఏపీ సిఐడి అధికారులు హైదరాబాద్ ఇంట్లో ఉండగా అరెస్టు చేశారు.గత కొంత కాలం నుండి పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు వైసీపీ ని వ్యతిరేకించే మీడియా వర్గాలకు.

 Ap Cid Arrested Mp Ragurama Krishnam Raju-TeluguStop.com

ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ లు ఇస్తున్న సంగతి తెలిసిందే.అంతమాత్రమే కాకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్ ని.వైసీపీ పార్టీకి చెందిన కీలక నాయకులను టార్గెట్ చేసుకుని భారీ స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు.అదే రీతిలో జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో .కూడా పిటిషన్ వేయడం జరిగింది.

ఇటువంటి తరుణంలో పుట్టినరోజు నాడు హైదరాబాదులో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఏపీ సిఐడి అధికారులు ఆయన నివాసానికి చేరుకుని రఘురామకృష్ణం రాజును అదుపులోకి తీసుకున్నారు.

 Ap Cid Arrested Mp Ragurama Krishnam Raju-బిగ్ బ్రేకింగ్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తొలుత ఆయన భద్రతా సిబ్బంది రక్షణ వలయంగా.రఘురామకృష్ణంరాజు చుట్టూ ఉండి.ఏపీ సిఐడి పోలీసులను అడ్డుకోవడం జరిగింది.పై అధికారుల నుండి అనుమతి తీసుకోవాలి అని రఘురామకృష్ణంరాజు భద్రతా ఇబ్బంది కోరగా వెంటనే…  ఉన్నతాధికారుల నుంచి ఏపీ సిఐడి పోలీసులు అనుమతి తీసుకోవటం .తదనంతరం వెంటనే రఘురామకృష్ణం రాజును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.ఈ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందున 124 ఐపీసీ ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసి రెబెల్ ఎంపీని సిఐడి పోలీసులు అరెస్టు చేశారట.

#Ysrcp #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు