పరిపాలన రాజధాని శంకుస్థాపన ఈ నెల 16న కాదు దసరాకే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సీఆర్డీఏ రద్దు బిల్లు కు హైకోర్టు బ్రేక్ వేసింది.దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసుపై సత్వరమే విచారణ చేపట్టాలని తాజాగా సుప్రీం ధర్మాసనంకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ కూడా రాసింది.

 Andhrapradesh Capital Inaguration Halted, Ap Governament, Ap Capitals, Crda Bill-TeluguStop.com

ఇంకా దానిపై విచారణ మొదలవ్వకపోవడంతో విశాఖపట్నంలో ఈ నెల 16న జరగవలసి ఉన్న శంకుస్థాపనకు బ్రేక్ పడింది.ఈ శంకుస్థాపనకు జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవ్వాలని కోరారు.

మరి అలాంటి అంశం ఇక ఇప్పుడు కోర్టు కేసుల నేపథ్యంలో వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Telugu Ap, Crda, Jagan, Narendra Modi, Supreme, Vishakapatanam-

ఇలాంటి టైంలో బ్రేక్ పడిన శంకుస్థాపన ఎప్పుడు జరుపుతారని ఏపీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ప్రస్తుతం ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ శంకుస్థాపన కార్యాన్ని దసరాకి నిర్వహించాలని భావిస్తున్నట్టు దానికి తగ్గట్టు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే రాజధాని అంశంలో పెద్ద ఎత్తున అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రభస జరుగుతుంది.

మరి అలాంటి రాజధాని అంశం ప్రభుత్వం భావించినట్టు దసరా కైనా ఓ కొలిక్కి వస్తుందో లేదో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube