ఏపీ రాజధాని అమరావతి మిస్‌ అయ్యింది

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధాని అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.ఏపీ రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేస్తానంటూ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం తెగ ప్రచారం చేశాడు.

 Ap Capital City Amaravathi Misss In New India Map-TeluguStop.com

అయితే అయిదు సంవత్సరాల్లో అమరావతి భవనాల నిర్మాణం కూడా పూర్తి కాలేదు.ఈలోపు జగన్‌ ప్రభుత్వం వచ్చింది.

జగన్‌ అమరావతి విషయాన్ని పూర్తిగా పక్కకు పెట్టేశాడు.రాజధాని విషయంలో జగన్‌ ప్రభుత్వం వైఖరీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏపీ మంత్రులు మరియు వైకాపా నాయకులు ఇతర పార్టీ వారు అంతా కూడా కలిసి రాజధాని విషయంలో గందరగోళ పరిస్థితులు క్రియేట్‌ చేస్తున్నారు.ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త భారతదేశ పటంపై ప్రస్తుతం చర్చ తలెత్తింది.

జమ్ము కశ్మీర్‌ నుండి లడఖ్‌ విడిపోయిన తర్వాత ప్రభుత్వం కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది.ఆ మ్యాప్‌లో ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానిని గుర్తించలేదు.అన్ని రాష్ట్రాల రాజధానులను గుర్తించిన కేంద్ర హోం శాఖ ఏపీ రాజధాని విషయంలో మాత్రం ఖాళీ వదిలేసింది.అంటే కేంద్రం దృష్టిలో ఇంకా ఏపీకి రాజధాని లేదు అని అర్థం.

అమరావతి రాజధానిగా ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు.కాని గెజిట్‌ కాని కారణంగా ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించడం లేదు.

జగన్‌ ఈ విషయమై ఎలా స్పందిస్తాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube