ఆ రోజే ఏపీ మంత్రి వర్గ విస్తరణ ..?  

Ap Cabinet Extention Soon-

ఏపీ క్యాబినెట్లో చాలాకాలంగా ఖాళీగా ఉన్న పలు శాఖల మంత్రుల భర్తీ దిశగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నాడు. గత కొంతకాలంగా క్యాబినెట్ విచారణ అదిగో ఇదిగో అంటూ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నా… ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోతోంది. తాజాగా . ఈనెల 11న (ఆదివారం) ఏపి రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించాలని సిఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆ రోజే ఏపీ మంత్రి వర్గ విస్తరణ ..? -Ap Cabinet Extention Soon

ఖాళీగా ఉన్న రెండు స్థానాలను ముస్లిం మైనార్టీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారితో భర్తీ చేయనున్నారు. ముస్లింల నుంచి ఎండీ ఫరూక్‌, చాంద్ భాషా…ఎస్టీల నుంచి గుమ్మడి సంధ్యారాణి, వంతల రాజేశ్వరిలలో ఎవరో ఒకరికి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది.