13 జిల్లాలలో ఒక్క ఓటు పడదు..జగన్ కి బ్రాహ్మణ సంఘాల హెచ్చరిక       2018-06-14   03:33:41  IST  Bhanu C

తెలుగుదేశం పార్టీ పై నిన్నటి వరకూ మండి పడుతూ వచ్చిన కొంతమంది బ్రాహ్మణ నాయకులు..సంఘాలు ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం పై నిరసనలు కూడా తెలిపాయి..మా బ్రాహ్మణుల పై పగపెట్టుకుంటారా మీ ఇష్టం వచ్చినట్లు వ్యవరిస్తారా అంటూ బ్రాహ్మణుల రిటైర్మెంట్ జీవో పై మండిపడ్డాయి..దాంతో చంద్రాబు నాయుడు బ్రాహ్మణుల కోసం ఏర్పాటు చేసిన కార్పోరేషన్ ఫలితాలు వగైరా వగైరా అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి..దాంతో ఇప్పుడు బ్రాహ్మణులకి తెలుగుదేశం పార్టీ కి నిప్పు ఉప్పులా తయారయ్యింది..ఈ పరిస్థితి కలగడానికి ఒకరకంగా రమణ దీక్షితులు ఎపీసోడ్ కీలక పాత్ర పోషించింది..

-

అంతేకాదు ఐవైఆర్ ఇష్యు కూడా తెలుగుదేశం పార్టీ కి బ్రహ్మనులని దూరం చేసిందనే చెప్పాలి…బ్రాహ్మణుల కి తెలుగుదేశం పై ఉన్న కోపం వైసీపికి అనుకూలించి ఓట్లుగా మార్చుకునే దశకి వచ్చిన తరుణంలో ఒక్కసారిగా జగన్ చేసిన పనికి యావత్ 13 జిల్లాల బ్రాహ్మణ సంఘాలు జగన్ పై నిప్పులు చెరుగుతున్నాయి..ఒక్కసారిగా సంఘాలు అన్నీ ఎదురు తిరిగాయి ఒక్క ఓటు కూడా జగన కి పడకుండా చేస్తామని హెచ్చరికలు చేశాయి..ఇంతకీ బ్రాహ్మణ సంఘాలు జగన్ కి హెచ్చరికలు చేసేట్టుగా ఏమిజరిగింది అంటే..

నిన్న రాజమండ్రి లో న బ్రాహ్మణ ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. జగన్ వస్తారన్న వైసీపీ నేతల భరోసాతో చాలా భారీ ఏర్పాట్లు చేశారు 13 జిల్లాల బ్రాహ్మణ సంఘాల నాయకులు పెద్దలు.. తరలి వస్తే జగన్ ఈ సభకు రాకుండా తమను అవమానపరిచారని రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సమాఖ్య ప్రతినిధులు మండిపడుతున్నారు.

అయితే ఈ అవమానంపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నేతలు… రాజమండ్రిలోని ఓ హోటల్‌లో సమావేశం అయ్యారు.

జగన్ బ్రాహ్మణులని ఎంతగానో అవమానించారని ..జగన్ తీరు తీరు ఎంతో భాదాకరంగా ఉందని ఈ విషయంపై జగన్ గనుకా క్షమాపణ చెప్పకపోతే తన స్పందన తెలుపకపోతే భవిష్యత్త్ కార్యాచరణ చేపడుతామని 13 జిల్లాల లో ఉన్నమా సామజిక వర్గం నేతలు అందరూ వైసీపికి వ్యతిరేకంగానిరసనలు తెలిపుతామని మా నుంచీ ఒక్క ఓటు కూడా పడకుండా చేస్తామని జగన్ ని హెచ్చరించారు.దీంతో వైసీపి నేతలు తలలు పట్టుకుంటున్నారు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్న బ్రాహ్మణుల ఓట్లు మనకి పడతాయి అంటుకుంటే జగన్ ప్రవర్తనతో దూరం అయ్యేలా ఉన్నాయని మధనపడుతున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.