బీజేపీ సీఎం అభ్యర్ధిగా ఆ రెడ్డి నేత ఫిక్స్ అయ్యారా..  

Ap Bjp Cm Candidate Nallari Kiran Kumar Reddy-

ఏపీలో తెలుగుదేశం పార్టీ బలహీన పడటంతో జగన్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ తన బలాన్ని పుంజుకోవడానికి సర్వం సిద్దం అవుతోంది.ఏపీలో ఎప్పటి నుంచో పాగా వేయడానికి వ్యూహాలు రచిస్తున్న బీజేపీ నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే తీవ్ర స్తాయిలో చర్చలు జరుపుతున్న బీజేపీ అగ్ర శ్రేణి నాయకత్వం...

Ap Bjp Cm Candidate Nallari Kiran Kumar Reddy--AP Bjp Cm Candidate Nallari Kiran Kumar Reddy-

ఏపీలో నిలదొక్కు కోవాలంటే సరైన నాయకుడు కావాలని అందుకు ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనే కోణంలో తలమునకలవుతోంది.ఈ క్రమంలోనే

Ap Bjp Cm Candidate Nallari Kiran Kumar Reddy--AP Bjp Cm Candidate Nallari Kiran Kumar Reddy-

మాజీ స్పీకర్, మాజీ ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు పరిసీలిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.కాంగ్రెస్ హయాంలో అన్యూహ్యంగా సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ తరువాత విభజన పరిణామాలతో పార్టీ పెట్టి కాంగ్రెస్ కి బై బై చెప్పారు.మళ్ళీ 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గూటికే చేరారు.అయినా సారే యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ వచ్చారు.

ఇప్పుడు తాజాగా నల్లారి వారి పేరు బీజేపీ లో చక్కర్లు కొడుతోంది.తాజాగా .

బీజేపీ నేత ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి తిరిగి వస్తారని, బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.అలాగే ఏపీలో నుంచీ కొంతమంది కీలక నేతలు బీజేపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.ప్రస్తుతానికి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని తెలిపారు.

అయితే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ లో పదవి అలంకరించడమే కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో ఇమడలేక పోవడానికి కారణమనేది ఆయన సన్నిహితులు పరిశీలకులు చెప్పే కారణం...

ఎందుకంటే అప్పట్లో తెలుగు రాష్ట్రాలలో బీజేపీ యాక్టివ్ గా లేదు.మిగిలిన పార్టీలలో ఒక మాజీ ముఖ్య మంత్రి ఎలా ఇమడగలరు.

కాంగ్రెస్ చూస్తే భవిష్యత్తు సూన్యం.దాంతో ఆయన రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేయలేక పోయారు అంటున్నారు.కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రలాలో బీజేపీ బలపడుతోంది.

దాంతో కిరణ్ కుమార్ రెడ్డి కి మాంచి అవకాశం దొరికింది.అంతేకాదు రెడ్డి సామాజిక వర్గానికి చెందినా నేత కావడంతో బీజేపీకి ఏ విధంగా చూసుకున్నా సీఎం అభ్యర్ధి దొరికినట్టే.బీజేపీ అధిష్టానం కూడా ఈ విధంగానే ఆలోచన చోస్తోందట.

అందుకే మాధవ్ కూడా కిరణ్ కుమార్ పేరు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది.కాలం కలిసొస్తే భవిష్యత్తులో కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ బీజేపీ సీఎం అభ్యర్ధిగా అవుతాడనడంలో సందేహం లేదని అంటున్నారు రాజకీయ పండితులు.