కాపు ఒట్లకోసమే కన్నా..అసలు అధ్యక్షుడు ఎవరంటే..?

ఏపీ బీజేపీ కి అధ్యక్షుడు ఎవరు.? ఏమిటి ఈ వింత ప్రశ్న సరే కన్నా లక్ష్మీ నారాయణ ఇదే కదా అందరికీ తెలిసిన విషయం అయితే ఏపీ బీజీపీ కి కన్నా కాకుండా మరొక అధ్యక్షుడు కూడా ఉన్నాడండోయ్ కన్నా అధికారికంగా అయితే ఈ షాడో అధ్యక్షుడు మాత్రం రియల్ అద్యక్షుడు కంటే కూడా తెగ హడావిడి చేస్తూ ఉంటాడు.సరే ఇప్పటికే మీకు ఒక అంచనా వచ్చేసి ఉంటుంది కదా అతనెవరో కాదంటే సోము వీర్రాజు.పాపం ఏపీ బీజేపి పగ్గాలి చేతికి వస్తాయని వేచి చూసిన సోము కి ఘలక్ ఇచ్చిన అధిష్టానం ఆ ప్లేస్ లో కన్నా ని కూర్చోపెట్టింది.

 Ap Bjp Shadow President-TeluguStop.com

అయితే అసలు ఏపీలో అధికార పక్షాన్ని బీజేపి తరుపున దుమ్మెత్తి పోయాలి చీల్చి చెండాడాలి అంటే ముందుగా అధ్యక్షుల వారు ఉంటారు.కానీ

ఏపీలో అధికార‌ప‌క్షాన్ని ఇరుకున పెట్ట‌డంలో ఎవ‌రు ముందున్నారు.ఎవ‌రు చంద్ర‌బాబుకు కౌంట‌ర్ ఇస్తున్నారు.ఎవ‌రు ఎక్కువ‌గా అధికార పార్టీపై విరుచుకుప‌డుతున్నారు.

అసలు ఏపీ బీజేపి పేరు చెప్తే గుర్తుకు వచ్చేది ఎవరు అంటే సోము వీర్రాజు అంటూ చటుక్కున చెప్పేయచ్చు.అయితే కన్నా ఎంట్రీ తో కొంతకాలం సైలెంట్ అయిన సోము మళ్ళీ సీన్ లోకి ఎంటర్ అయ్యారు ఎందుకంటే క‌న్నా.

ఆశించిన మేర‌కు పార్టీని న‌డిపించ‌క‌పోవ‌డమే అంటున్నారు.కన్నా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు చేయ‌డంలో చాలా వెనుక‌బ‌డిపోయారు.

ముఖ్యంగా బీజేపీ.వైసీపీతో రాసుకు పూసుకు తిరుగుతోందన్న వ్యాఖ్య‌ల‌ను కూడా ఆయన తిప్పికొట్ట‌లేక‌పోయారు.

ఇదిలాఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల‌పైనా ఆయ‌న స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేక‌పోతున్నారు…తాము ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతామ‌ని చెబుతున్నా.175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఒంట‌రిగానే పోరు చేస్తామ‌ని అంటున్నా.ప్ర‌జ‌ల‌ను మాత్రం క‌న్నా న‌మ్మించ‌లేక‌పో తున్నారు.పదునైన మాటలు లేకపోవడం.ఎందుకు ఈ కుర్చీ నాకు ఇచ్చారు అనుకుంటూ నీరసించి పోతున్నారు తప్ప ఒక అధ్యక్ష హోదాలో చూపించావలసిన తెగువ ఎక్కడ కనిపిచడం లేదు దాంతో అధిష్టానం సోము కి షాడో అధ్యక్షుడిగా పార్టీని నడపాలని ఆదేశించిందట.దాంతో సోము గత కొన్ని రోజులగా మళ్ళీ చంద్రబాబు పై టీడీపీ పై విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

అయితే ఈ మొత్తం వ్యవహారం లో కన్నా కొంచం కినుకుగా ఉన్నా ఇప్పుడు బయటకి వెళ్ళలేక లోపల ఉండలేక తప్పక కాంప్రమైజ్ అవుతున్నారట…అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.బీజేపి కి ముందే కన్నా పెర్ఫార్మెన్స్ గురంచి తెలుసునని అయితే ఏపీలో కాపుల ఓట్లు కొల్లగోట్టాలి అంటే తప్పకుండా ఓ సీనియర్ నేతని పార్టీ అధ్యక్షుడిగా చేయక తప్పదని భావించిన అధిష్టానం కన్నాని ఎంపిక చేసిందట అయితే చేసీ చేయగానే తనని డమ్మీ చేస్తే ఎలా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్న వారికి కన్నా పూర్ రిజల్స్ చూసి సోము ని రంగం లోకి దింపారని టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube