కన్నా కు షాక్: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ?

ఏపీలో పార్టీని పరుగులు పెట్టించాలని చూస్తున్నా బిజెపి దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్పటికే ఏపీలో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ముందు ముందు పార్టీకి ఏపీలో మంచి ఊపు వస్తుందని భావిస్తోంది.

 Ap Bjp President To Be Madhavu-TeluguStop.com

ముఖ్యంగా పవన్ కలుపు వెళ్ళడం ద్వారా ఏపీలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న కాపులను తమవైపు తిప్పుకోవడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ ను ఉపయోగించుకుని బిజెపి ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ పార్టీలకు దీటుగా తయారు అవ్వాలనే ఆలోచనలో ఉంది.ఈ నేపథ్యంలో ఏపీ బిజెపి అధ్యక్షుడుని మార్చాలనే నిర్ణయానికి వచ్చింది.

Telugu Ap Bjp, Ap Bjp Madhavu, Apfarmar, Madhavu, Nationalbjp, Pawankalyan-Polit

ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా ఆ బాధ్యతల నుంచి తప్పుకుని జేపీ నడ్డా కు ఆ బాధ్యతలు అప్పచెప్పారు.ఇక ఆంధ్ర తెలంగాణలో కూడా అధ్యక్షులు మార్పు ఉండబోతుందని ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో ఏపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనే విషయం పై ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతోంది.ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మీనారాయణ ఎన్నికలకు ముందే బిజెపిలో చేరారు.

అయితే అలా చేరగానే సామాజిక వర్గ కోటాలో భాగంగా ఏపీ బిజెపి అధ్యక్ష పదవి దక్కింది.అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో బిజెపి పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడింది.

Telugu Ap Bjp, Ap Bjp Madhavu, Apfarmar, Madhavu, Nationalbjp, Pawankalyan-Polit

ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అంతా పవన్ వెంటే ఉంటారు కాబట్టి, ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఉంచినా పెద్దగా ఉపయోగం ఏమీ లేదని లెక్కలు బీజేపీ అధిష్టానం వేసుకుంది.అందుకే బీసీ సామాజికవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ను అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన మాధవ్ బీజేపీ లో కీలక నాయకుడిగా ఎదిగారు.ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉండడంతో ఆయనకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం మరోసారి తనకు రెన్యువల్ అవుతుందని ఆశలు ఉన్నా.మాధవ్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube