ఇలా అయితే గెలిచేది ఎలా సోమూ ? 

ఇంకేముంది ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు తీసేసుకున్నాడు.ఇక బీజేపీ ఏపీలో తిరుగులేకుండా బాగా బల పడుతుంది అని బీజేపీ అధిష్టానం పెద్దలతో పాటు, ఏపీ బీజేపీలోని వీర్రాజు వర్గం నాయకులు సంబరపడిపోయారు.

 Ap Bjp President Somu Veerraju Troubled With Present Political Situation , Somu-TeluguStop.com

అనుకున్నట్లుగానే మొదట్లో వీర్రాజు ప్రభావం బాగా కనిపించింది.పార్టీని క్రమశిక్షణలో పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.

మరెంతో మంది పార్టీ సీనియర్ నాయకులు సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడలేదు.ఈ విషయంలో బీజేపీ అధిష్టానం పెద్దలు సైతం వీర్రాజు కి బాగా ఫ్రీడం ఇచ్చారు బిజెపిలోని 23 గ్రూపులను తట్టుకుంటూ బీజేపీ ఇమేజెస్ పెంచడంలో వీర్రాజు సక్సెస్ అయ్యారు.

దీనికి తోడు జనసేన పార్టీ మద్దతు కూడా ఉండడంతో ఇక అధికారం దక్కించుకోవడం ఒకటే మిగిలి ఉందని, సంబరపడుతూ వచ్చారు.

కానీ ఇటీవల వెలువడిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం అంతంతమత్రంగానే కనిపించింది.

కనీసం తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన ,బీజేపీ కలిసి చాలాచోట్ల పోటీకి దిగే ఛాన్స్ కోల్పోయాయి.జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా, బీజేపీ ఏమీ మాట్లాడలేకపోయింది.

ఇక బీజేపీ అభ్యర్థి ని తిరుపతి లోక్ సభ కు పోటీకి దింపేందుకు జనసేన పార్టీని ఒప్పించి మరి తిరుపతి లో పోటీ కి రెడీ అవుతున్న బీజేపీకి అక్కడ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు.దీనికి కారణం తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో పెద్దగా ఓట్లు రాకపోవడం, అలాగే తమ మిత్రపక్షమైన జనసేనకు సైతం అంతంతమాత్రంగానే ఓటింగ్ నమోదవడం ఇప్పుడు బీజేపీ ని కలవరానికి గురిచేస్తున్నాయి.

మొదటి నుంచి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో బీజేపీ , జనసేన పార్టీలు పోటీ చేసేందుకు సిద్ధం అయ్యాయి ఎట్టకేలకు వారి మధ్య ఒప్పందం ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు.పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీ అధ్యక్షుడు ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి.

Telugu Ap Bjp Permance, Ap Bjp, Ap, Ap Panchayat, Central Bjp, Jagan, Janasena,

  ఈ ఎఫెక్ట్ తో బీజేపీ అధిష్టానం పెద్దలకు సైతం మింగుడు పడటం లేదు.దీంతో త్వరలోనే వీర్రాజు  ఢిల్లీకి పిలిచి అధిష్టానం పెద్దలు క్లాస్ పీక బోతున్నట్లు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఇప్పుడు జరిగిన పంచాయతీ , మున్సిపల్ ఎన్నికలు బీజేపీని అంతగా దెబ్బతీశాయి.అంత రెట్టింపు స్థాయిలో సోము వీర్రాజు క్రెడిట్ ను.బాగా దెబ్బ తీసిందిి.ఈ విషయంలో ప్రత్యక్షంగా వీర్రాజు తప్పు ఏమీ లేకపోయినా, బీజేపీ అధ్యక్షుడు హోదాలో ఆ తప్పులను మోయాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube