అనుమానాస్పద స్థితిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి…  

Ap Bjp President Kanna Laxminarayana Daughter In Law Death - Telugu Ap Bjp President, Death News, Hyderabad, Kanna Laxminarayana, Suharika

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ చిన్న కొడుకు ఫణీంద్ర భార్య సుహారిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది.

 Ap Bjp President Kanna Laxminarayana Daughter In Law Death

 వివరాల్లోకి వెళితే సుహారిక తన భర్త, కుటుంబ సభ్యులతో స్థానిక నగరంలో నివాసం ఉంటోంది.

ఈ క్రమంలో తన స్నేహితురాలిని కలుసుకునేందుకు  మాదాపూర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది.ఈ క్రమంలో సుహారిక ఉన్నట్లుండి అస్వస్థతకు గురై కుప్పకూలింది.

అనుమానాస్పద స్థితిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో ఆమె స్నేహితురాలు వెంటనే చికిత్స నిమిత్తం సుహారికను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది.
  సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షుణ్నంగా పరిశీలించి ఆధారాలను సేకరించారు.

అంతేగాక సుహరిక ఇక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.ఈ క్రమంలో సుహారిక స్నేహితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో ప్రస్తుతం తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Bjp President Kanna Laxminarayana Daughter In Law Death Related Telugu News,Photos/Pics,Images..

footer-test