మంత్రి పెద్దిరెడ్డి కి సవాల్ విసిరిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు..!!

Ap Bjp President Challenges Minister Peddireddy

ఏపీ బీజేపీ అధ్యక్షుడు వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి సవాల్ విసిరారు.రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది.? కేంద్రం ఎన్ని నిధులు ఖర్చు పెట్టింది.? అనే దాని విషయంలో చర్చకు సిద్ధమా అని వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి కి సోము వీర్రాజు సవాల్ విసిరారు.ఇదే ఏజెండాగా బద్వేల్ బై పోల్ ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు.గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి గ్రామాలకు… ముఖ్యమంత్రి ఇచ్చిన డబ్బు ఎక్కువ.? లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఎక్కువ.? అనే దాని విషయంలో చర్చకు రావాలని కోరారు.ఈ విషయంపై బద్వేల్ ఉప ఎన్నికలలో వైసిపి పార్టీ సమాధానం చెప్పాలని ఇదే ఏజెండాపై ఉప ఎన్నికలకు వెళ్తామని.సోము వీర్రాజు స్పష్టం చేశారు.

 Ap Bjp President Challenges Minister Peddireddy-TeluguStop.com

14, 15 ఫైనాన్స్ కమిటీ నిధులు గాని., స్వచ్ఛభారత్ నిధులు గాని .జల శక్తి మిషన్ నిధులు గాని, ఇలా ఏ నిధులైనా  సరే… కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప.మీరు ఇచ్చిన నిధులు లేదా పథకం ఒకటైన చెప్పాలని భారతీయ జనతా పార్టీ చాలెంజ్ చేస్తున్నట్లు సోము వీర్రాజు పేర్కొన్నారు.

ఈ నెల 30వ తారీఖున బద్వేలు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.ఈ క్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీలు ఈ ఉప ఎన్నికల పోటీకి దూరంగా ఉన్నాయి.వైసీపీ పార్టీ భారతీయ జనతాపార్టీ మరికొంత మంది సభ్యులు పోటీ చేస్తూ ఉన్నారు.ఇదిలా ఉంటే బిజెపి పార్టీకి మద్దతుగా జనసేన పార్టీ ప్రచారం లోకి వస్తున్నట్లు.

 Ap Bjp President Challenges Minister Peddireddy-మంత్రి పెద్దిరెడ్డి కి సవాల్ విసిరిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వార్తలు వస్తున్నాయి.ఏది ఏమైనా బద్వేలు ఉప ఎన్నికలలో బిజెపి సత్తా చాటాలని.

కేంద్ర నిధుల సాయంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిరూపించాలని.రాష్ట్ర కీలక నేతలు బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

#Somu Veeraaju #Peddi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube