బ్రేకింగ్: మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

మాజీ మంత్రి,బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు కన్నుమూశారు.గత కొద్దీ రోజులుగా కరోనా తో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది.

 Ap Ex-minister Mamikyala Rao Died Due To Corona , Ap, Bjp, Manikyalarao, Private-TeluguStop.com

ఛాతినొప్పి,హైబీపీ తో పాటు కరోనా కూడా సోకడం తో ఆయన నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది.అయితే ఆయన ఆరోగ్యం విషమించడం తో డాక్టర్ల పర్యవేక్షణలోనే నిత్యం వైద్యం అందిస్తున్నారు.అయితే ఆయన ఆరోగ్యం మరింత విషమించడం తో శనివారం తుది శ్వాస విడిచారు.1961 ల తాడేపల్లి గూడెం లో జన్మించిన ఆయన తొలుత ఒక ఫోటోగ్రాఫర్ గా జీవితాన్ని ప్రారంభించి ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా ఎదిగారు.2014 లో తాడేపల్లి గూడెం నుంచి బీజేపీ తరపున తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మిగతా పార్టీలను తట్టుకొని ఆ నియోజక వర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు.2014 ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ పార్టీల మధ్య నెలకొన్న పొత్తు నేపథ్యంలో టీడీపీ కేబినెట్ లో ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వర్తించారు.

2014 నుంచి 2018 వరకు కూడా ఆయన ఆ శాఖ మంత్రిగానే కొనసాగారు.ఇటీవల కరోనా సోకడం తో గత నెల రోజులుగా ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుండగా శనివారం మృతి చెందారు.ఆయన మృతి పై పలువురు రాజకీయ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.60 ఏళ్ల మాణిక్యాల రావు ఏపీ లో బీజేపీ పార్టీ కీలక నేతగా వ్యవహరించారు.అలాంటి ఆయన మృతి చెందడం బీజేపీ పార్టీ కి గట్టి దెబ్బ అనే విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube