అయ్యో పాపం బీజేపీ ? వాళ్లు సరే వీళ్ల సంగతేంటి ?  

AP BJP, BJP Leaders,Kanan laskhmi Narayana, Sujana Chowdary, YCP Govt - Telugu Ap Bjp, Bjp Leaders, Kanan Laskhmi Narayana, Sujana Chowdary, Ycp Govt

కేంద్ర అధికార పార్టీ గా, తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్న బీజేపీకి ఏపీ రాజకీయ పరిస్థితి ఒక పట్టాన అర్థం కావడం లేదు.ఏపీ బీజేపీ ని ఎంత పైకి తీసుకు వద్దాం అనుకున్నా, అది సాధ్యపడడం లేదు.2024 ఎన్నికల నాటికి ఏదో ఒక రకంగా అధికారం దక్కించుకోవాలని తహతహలాడుతోంది.ఎలాగూ జనసేన పార్టీ తో పొత్తు ఉన్న కారణంగా, తమకు మెరుగైన అవకాశాలు ఉంటాయని బిజెపి అంచనా వేస్తోంది.

 Ap Bjp Leaders Ycp Govt

కానీ బిజెపి అంచనాలు మాత్రం ఏపీ బిజెపి నాయకులు అందుకోలేక పోతున్నారు.అధికార పార్టీ వైసిపి దూకుడును తగ్గించే విధంగా ప్రభుత్వం లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ, ప్రజా ఉద్యమాలు, ఆందోళన లు చేపడుతూ రాజకీయంగా పైచేయి సాధించాలని ఏపీ బీజేపీ నాయకులు ప్లాన్ చేసుకుంటూ ఇప్పటికే అనేక కార్యక్రమాలు రూపొందించుకుని అమలు చేశారు.

కానీ ఎక్కడ ఏ ఆందోళన కార్యక్రమాలు జరిగినా, రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు హాజరు అవుతున్నారు తప్ప, ఎక్కడ కార్యకర్తలు హాజరు కావడం లేదు.

అయ్యో పాపం బీజేపీ వాళ్లు సరే వీళ్ల సంగతేంటి -Political-Telugu Tollywood Photo Image

ఏ కార్యక్రమం జరిగినా ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కానీ, రావెల కిషోర్ బాబు కానీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వంటి వారు మాత్రమే హాజరు అవుతున్నారు తప్ప, క్షేత్ర స్థాయి కార్యకర్తల ఎవరు ఆందోళన కార్యక్రమాల్లో కనిపించడం లేదు.

దీంతో మొక్కుబడిగా కార్యక్రమాలు ముగించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది.ఇప్పటికే తిరుమల భూముల అమ్మకం నిలిపి వేయాలంటూ చేపట్టిన ఒకరోజు దీక్ష , కరెంటు బిల్లులు తగ్గించాలంటూ నిరసనలు, మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల అమ్మకం, వంటివి చేపట్టి, దీక్షలు ఇలా చాలా కార్యక్రమాలు చేపట్టింది.

నిరసన కార్యక్రమం చేసినా బిజెపి జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రమే పాల్గొంటున్నారు కానీ, కార్యకర్తలు ఎక్కడా కనిపించడంలేదు.దీంతో బీజేపీ నాయకుల్లో ఆందోళన కనిపిస్తోంది.

నాయకుల వరకు మాత్రమే తమ పార్టీ అనే సందేహాలు జాతీయ బిజెపి నాయకుల్లోనూ వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం నాయకులు కార్యకర్తలు ఎవరు బిజెపిలో చేరేందుకు ఇష్టపడకపోవడం వంటివి ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు.ఇక కేంద్రంలో బిజెపి అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళేవారు కూడా కనిపించడం లేదు.ఏదో ధర్నాలు దీక్షలు అంటూ హడావుడి చేయడం తప్ప, తమ పార్టీ విధివిధానాలను చేస్తున్న కార్యక్రమాలను, కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి బిజెపి వైపు దృష్టి పడే విధంగా చేసుకోలేకపోవడంతో ఏపీ బీజేపీ ఏపీలో ఎదగలేకపోతోంది.

అందుకే క్షేత్రస్థాయిలో బలం పెంచుకుని పెద్దఎత్తున కార్యకర్తలను తయారు చేసుకోవాలనే ఆలోచనతో బిజెపి ఉన్నా, బీజేపి వైపు వెళ్లేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.కేవలం నియోజకవర్గ స్థాయి నాయకులు మాత్రమే బీజేపీ వైపు చూస్తున్నారు.

అదికూడా తమకున్న వ్యాపారాలు దృష్ట్యా, ప్రభుత్వం వేధింపులకు భయపడి వెళ్తున్న వారే కానీ, మిగతా వారు ఎవరు అటువైపుగా చూస్తున్న పరిస్థితి కనిపించడం లేదు.

#Sujana Chowdary #YCP Govt #Bjp Leaders #AP Bjp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Bjp Leaders Ycp Govt Related Telugu News,Photos/Pics,Images..