ఇక చుస్కో బాబు... ఉస్కో అంటున్న ఏపీ బీజేపీ నేతలు !       2018-06-12   00:40:27  IST  Bhanu C

ఏపీ బీజేపీ నేతలందరికీ ఒక్కసారిగా ధైర్యం వచ్చిందో లేక హైకమాండ్ నుంచి సిగ్నల్ వచ్చిందో తెలియదు కానీ ఒక్కసారిగా నేతలంతా లైన్ లోకి వచ్చేసారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని లక్ష్యంగా చేసుకుని విమసలు గుప్పించారు. ఎప్పుడూ రొటీన్ గా విమార్సాలు చేసే బీజేపీ నాయకులకు ఇపుడు కొన్ని కొత్త గొంతుకులు తోడయ్యాయి. ప్రధాని మోడీపై టీడీపీ నేతల విమర్శలను నిరసిస్తూ విజయవాడలో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. విజయవాడ ధర్నాచౌక్ లో జరుగుతున్న మహాధర్నాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎంపీ గోకరాజు గంగరాజు కేంద్రమాజీ మంత్రి పురందేశ్వరి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

-

రాజకీయ లబ్దికోసమే కేంద్రంపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడని మాజీ కేంద్ర మంత్రి పురందీశ్వరి ఆరోపించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయారని, బీజేపీని ఏపీ ద్రోహిగా చూపే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఏపీకి చేసింది మాత్రం ఏమీ లేదాహాని ఆమె దుయ్యబట్టారు. ఏపీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఈ అవినీతిపై సీబీఐ విచారణ కోరేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా? అని పురందేశ్వరి ప్రశ్నించారు.

పెన్షనర్లను బెదిరించి మరీ నవనిర్మాణ దీక్షలకు తీసుకొచ్చారన్నారు. పట్టిసీమలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. పట్టిసీమలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పంపుసెట్ల విషయంలో రూ.60 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఒక్క క్యూబిక్ మట్టికి రూ.21 వేలు ఇచ్చి రూ.69 కోట్లు స్వాహా చేశారన్నారు. ఇక ఆ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ ముఖ్య నాయకులు అంతా చంద్రబాబు ని లక్ష్యం గా చేసుకుని ఆరోపణలు గుప్పించారు. ఇక రానున్న రోజుల్లో మరింత దూకుడు పెంచుతామని సంకేతాలు వారు ఇచ్చారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.