వీర్రాజు కు పదవీ గండం ?

 Veerraju's Position Is Denjour ,ap Bjp, Bjp, Tdp, Ysrcp,janasena, Pavan Kalyan,-TeluguStop.com

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పార్టీలో ఇప్పుడు ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి.ఆయనపై అసంతృప్తితో ఉన్న నాయకులంతా ఏకం అవుతూ వరుసగా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.

పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకు వెళ్లే విషయంలో వీర్రాజు విఫలమయ్యారని,  కేవలం కొంతమందికే ప్రాధాన్యమిస్తూ , మిగిలిన వారిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ,  ఢిల్లీకి వెళ్లి మరీ కొంతమంది నేతలు అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేశారు.అంతే కాకుండా ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడి టిడిపిలో చేరడానికి వీర్రాజు వైఖరే కారణమని,  ఆయన వ్యతిరేక వర్గం ఫిర్యాదులు చేసింది.

ఇప్పటికే సోమ వీర్రాజు వైఖరి నచ్చక అనేకమంది నేతలు పార్టీని వీడి వెళ్లారు.ఇంకా అనేకమంది తమకు ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో ఉన్నారు.

ఏపీ బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆ పార్టీ అధిష్టానం తో పాటు,  రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న మురళీధరన్ కు ఈ వ్యవహారాన్ని తేల్చాల్సిందిగా బాధ్యతలు అప్పగించింది.

Telugu Ap Bjp, Bjp Ap Incharge, Dara Sambaiah, Janasena, Muralidharan, Pavan Kal

ఇప్పటికే సోమ వీర్రాజు పై ఫిర్యాదు చేసేందుకు కొంతమంది నేతలు ఢిల్లీకి వెళ్లారు.వారు ఏపీకి వచ్చిన వెంటనే పార్టీ ఇంచార్జి మురళీధరన్ కూడా ఏపీకి వచ్చారు.రాజమండ్రిలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.

కానీ ఆయనకు స్వాగతం పలికేందుకు,  ఆయన పర్యటనలో పాల్గొనేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు హాజరు కాలేదు.ఆ సమయంలో ఆయన కడప జిల్లా పర్యటనలో ఉన్నారు.

అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి వచ్చినా… సోమ వీర్రాజు హాజరు కాకపోవడం పై అనేక అనుమానాలు మొదలయ్యాయి.బిజెపి సీనియర్ నాయకుడుగా ఉన్న దార సాంబయ్య అనే నాయకుడు వీర్రాజు వైఖరిపై అనేకార ఫిర్యాదులు చేశారు.

దళితులకు,  మైనార్టీలకు పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యం దొరకడం లేదంటూ ఆయన ఫిర్యాదు చేశారట అలాగే తూర్పుగోదావరి జిల్లా నూతన కమిటీని నియామకం విషయంలోనూ వీర్రాజు  కొంతమంది ఆయన సన్నిహితులకు పదవులను కేటాయించారని, మిగిలిన సీనియర్లను పట్టించుకోలేదనే అసంతృప్తితో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అడబాల రామకృష్ణారావు తను పదవికి రాజీనామా చేశారు.

Telugu Ap Bjp, Bjp Ap Incharge, Dara Sambaiah, Janasena, Muralidharan, Pavan Kal

అలాగే కాకినాడ, కోనసీమ జిల్లాలోని బిజెపి నాయకత్వం రెండుగా చీలిపోయింది.ఈ వ్యవహారాలపైనే ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్ సమావేశం నిర్వహించగా , పార్టీ శ్రేణుల నుంచి వీర్రాజు వైఖరి పై అనేక ఫిర్యాదులు అందయట.ప్రస్తుతం ఏపీ బీజేపీలో సోము వీర్రాజు కు వ్యతిరేకంగా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండడం,  మెజార్టీ నాయకులు ఫిర్యాదులు చేస్తుండడంతో త్వరలోనే వీర్రాజు ను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరందుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube