జగన్ ను కంట్రోల్ చేయాల్సిందే ! వారు డిసైడ్ అయ్యారుగా ? 

తమకు బలం లేకపోయినా ప్రత్యర్థి బలం తగ్గించడం ద్వారా తమ బలం పెరిగిందని నిరూపించుకోవచ్చు అనే అభిప్రాయంలో ఏపీ బీజేపి నేతలు ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.ఏపీలో కొద్దో గొప్పో జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్న ఎక్కువ శాతం ప్రజలు జగన్ నిర్ణయాలకు మద్దతు పలుకుతున్నారు.

 Bjp, Janasena, Pavan Kalyan, Tdp, Chandrababu,jagan Ysrcp, Somu Veerraju, Govern-TeluguStop.com

జగన్ ఏం చేసినా అది ప్రజల మంచి కోసమే అని భావిస్తున్నారు.దీంతో వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులకు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.

Telugu Chandrababu, Governar, Jagan Ysrcp, Janasena, Pavan Kalyan, Somu Veerraju

ప్రస్తుతానికి ఈ పరిస్థితి పర్వాలేదు అనుకున్న రానున్న రోజుల్లో తమకు ఇబ్బందికరంగా మారుతుంది అనే భయం వారిలో నెలకొంది.ముఖ్యంగా ఏపీ బిజెపి నేతలు ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఏపీలో బలపడడం అనేది అసాధ్యం అనేది ఏపీ బిజెపి నేతల అభిప్రాయం.ఇటీవల తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే బిజెపి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది తెలియజేయడంతో ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలని , జగన్ దూకుడు కు అడ్డుకట్టవేసి తమ బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ మేరకు కేంద్ర బిజెపి పెద్దలపై ఒత్తిడి పెంచుతూ, జగన్ ను కంట్రోల్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ పదే పదే కోరుతున్నారు.

వరుస సంక్షేమ పథకాలు, సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జనాల్లో రోజురోజుకు జగన్ బలం పెంచుకుంటున్నారు.

రాబోయే ఎన్నికల్లో వైసీపీకి జనాలు పట్టం కడతారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.ఈ వ్యవహారాలు బిజెపి నేతలను కలవరపెడుతున్నాయి.

జనసేన , బిజెపి కలిసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నా, పరిస్థితులు సానుకూలత ఏర్పడకపోవడం,  జనసేన బిజెపి కి ఏపీలో అంతగా పట్టు లేకపోవడం, గ్రామస్థాయి నుంచి పటిష్టమైన నెట్వర్క్ లేకపోవడం ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి అనేది ఏపీ బిజెపి నేతల అభిప్రాయం.ఈ పరిస్థితిని ఇప్పుడు ఇప్పుడే మార్చాలన్నా సాధ్యం కాదు కాబట్టి, జగన్ బలాన్ని తగ్గించడం ద్వారా సక్సెస్ అనేది వారి వాదన .చాలా రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి రావడానికి , పై చేయి సాధించడానికి అధికార పార్టీపై గవర్నర్ల ద్వారా పెత్తనం చేయడం వంటివి చేస్తున్నాయి.దీంతో అక్కడ బీజేపీ పరిస్థితి మెరుగుపడుతోంది.

ఏపీలోనూ అదే పరిస్థితి కల్పించాలని , గవర్నర్ ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బిజెపి ఏపీ నేతల డిమాండ్.

Telugu Chandrababu, Governar, Jagan Ysrcp, Janasena, Pavan Kalyan, Somu Veerraju

అయితే ప్రస్తుత ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు జగన్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడం,  జగన్ నిర్ణయాలకు గవర్నర్ మద్దతు పలుకుతున్న తీరు బిజెపి ఏపీ నేతలకు ఏమాత్రం నచ్చడం లేదు.అందుకే గవర్నర్ ను మార్చే విషయంలో పార్టీ అధిష్టానం తమ అభిప్రాయాన్ని మార్చుకుని బిజెపి బలం పెరిగేలా చేయాలని డిమాండ్ ను పదే పదే వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube